అంతర్జాతీయ వార్తలు 2015 (International News 2015)
జనవరి 2015:
- 2015, జనవరి 4: అమెరికా సెనేట్‌కు ఎన్నికైన తొలి నల్లజాతీయుడు ఎడ్వర్డ్ బ్రూక్ మరణించాడు.
- 2015, జనవరి 9: శ్రీలంక జాతీయ ఎన్నికలలో అధ్యక్షుడు మహింద్ర రాజపక్సే ఓటమి. కొత్త అధ్యక్షుడిగా మైత్రీపాల సిరిసేన ఎన్నికయ్యారు.
- 2015, జనవరి 17: చైనాలోని జియాంగ్జు నదిలో పడవ బాల్టాపడి 21మంది మరణించారు.
- 2015, జనవరి 18: మనీలాలో జరిగిన పోప్ ప్రాన్సిస్ సందేశ కార్యక్రమానికి 50లక్షల మంది హాజరై ప్రపంచరికార్డు సృష్టించారు.
- 2015, జనవరి 20: దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రారంభమైంది.
- 2015, జనవరి 21: యెమెన్ అధ్యక్షుడిని తిరుగుబాటుదారులు బందీగా పట్టుకున్నారు.
- 2015, జనవరి 22: సౌదీ రాజు అబ్దుల్లా బిన్ అబ్దులజీజ్ మరణించాడు.
- 2015, జనవరి 22: ఇండో-అమెరికన్ రచయిత్రి ఝంపా లహరి రచించిన "ది లోలాండ్" పుస్తకానికి 50వేల డాలర్ల సాహిత్య పురస్కారం లభించింది.
- 2015, జనవరి 26: విశ్వసుందరి-2014గా అమెరికాకు చెందిన పౌలినా వెగా ఎంపికైంది.
- 2015, జనవరి 30: పాకిస్తాన్‌లోని షికార్‌పూర్ జిల్లాలో బాంబు పేలి 50 మంది మరణించారు.
ఫిబ్రవరి 2015:
- 2015, ఫిబ్రవరి 1: కుటుంబమాత్ర పితామహుడిగా పేరుపొందిన కార్ల్ జెరాస్సీ మరణించాడు.
- 2015, ఫిబ్రవరి 4: తైవాన్‌లో ట్రాన్స్‌ఏషియా విమానం కిలంగ్ నదిలో పడి 26మంది మరణించారు.
- 2015, ఫిబ్రవరి 6: ప్రపంచంలోనే అతిపెద్ద స్థూలకాయుడిగా పేరుపొందిన 444 కిలోల కీత్ మార్టిన్ (బ్రిటన్) మరణించాడు.
- 2015, ఫిబ్రవరి 12: తూర్పు ఉక్రేయిన్ సంక్షోభంపై శాంతి ఒప్పందం కుదిరింది.
- 2015, ఫిబ్రవరి 16: లిబియాలో 21 మంది క్రిస్టియన్లను ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు హతమార్చారు.
- 2015, ఫిబ్రవరి 22: బంగ్లాదేశ్‌లో పడవ మునిగి 60+ మరణించారు.
- 2015, ఫిబ్రవరి 23: ఆస్కార్ అవార్డులు=>ఉత్తమ చిత్రంగా బర్డ్ మ్యాన్, ఉత్తమ నటిగా జులియన్నే మూర్, ఉత్తమ నటుడిగా ఎడ్డి రెడ్‌మయిన్, ఉత్తమ దర్శకుడిగా అలెజాండ్రో ఇనర్రితు, ఉత్తమ విదేశీ చిత్రంగా ఇదా.
మార్చి 2015:
- 2015, మార్చి 9: అమెరికాలో భారత రాయబారిగా అరుణ్ సింగ్ నియమితులైనారు.
- 2015, మార్చి 20: ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి మాల్కంఫ్రేజర్ మరణించారు.
- 2015, మార్చి 21: సిరియా దాడులలో 45 మంది మరణించారు.
- 2015, మార్చి 24: ఫ్రాన్స్‌లో ఎయిర్ బస్-320 విమానం కూలి 144 మంది మరణించారు.
- 2015, మార్చి 23: సింగపూర్ జాతిపిత, తొలి ప్రధాని లీ క్వాన్ యూ మరణించారు.
- 2015, మార్చి 29: యెమెన్‌లో సంక్షోభం తలెత్తింది. హంతి తిరుగుబాటు దారులను లక్ష్యంగా చేసుకొని సౌదీ అరేబియా వైమానిక దాడులు ప్రారంభించింది.
ఏప్రిల్ 2015:
- 2015, ఏప్రిల్ 2: ప్రపంచంలో అత్యంత వృద్ధురాలైన జపాన్‌కు చెందిన మిసాకో ఒకావా (117 సం.లు) మరణించింది.
- 2015, ఏప్రిల్ 2: కెన్యాలో గరిస్సా విశ్వవిద్యాలయంపై అల్‌షబాబ్ ఉగ్రవాదులు దాడిచేసి 150 మందిని హతమార్చారు.
- 2015, ఏప్రిల్ 2: రష్యాలో ట్రాలర్ మునిగి 54+ మంది మరణించారు.
- 2015, ఏప్రిల్ 3: సౌరకుటుంబంలో ఒక ఉపగ్రహానికి విశ్వనాథన్ ఆనంద్ పేరుపెట్టబడింది. "4538 విషీ ఆనం" ఉపగ్రహం అంగారక, బృహస్పతి గ్రహాల మధ్య ఉంది.
- 2015, ఏప్రిల్ 10: ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెటర్ రిచీ బెనాడ్ మరణించాడు.
- 2015, ఏప్రిల్ 11: సౌరకుటుంబంలోని ఒక గ్రహశకలానికి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్ జాయ్ పేరుపెట్టబడింది.
- 2015, ఏప్రిల్ 14: లిబియా నుంచి ఇటలీ వెళ్తున్న పడవ ముక్కలై 400+ ప్రయాణీకులు మరణించారు.
- 2015, ఏప్రిల్ 19: మద్యధరా సముద్రంలో పడవ మునిగి 700 మంది మరణించారు.
- 2015, ఏప్రిల్ 21: పాకిస్తాన్ యొక్క అత్యున్నత ఆవార్డు "నిషాన్-ఇ-పాకిస్తాన్"ను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కు ప్రధానం చేశారు.
- 2015, ఏప్రిల్ 22: భారత మూలాలున్న వ్యక్తి పళని కుమనన్‌కు పులిట్జర్ బహుమతి లభించింది.
- 2015, ఏప్రిల్ 22: నేపాల్ బస్సు ప్రమాదంలో 17మంది భారతీయ యాత్రికులు మరణించారు.
- 2015, ఏప్రిల్ 25: నేపాల్‌లో భారీ భూకంపం సంభవించి 10,000కు పైగా మరణించారు.
మే 2015:
- 2015, మే 1: నాసాకు చెందిన అంతరిక్షనౌక బుధగ్రహాన్ని ఢీకొట్టింది.
- 2015, మే 8: పాకిస్తాన్‌లో హెలికాప్టర్ కూలి నార్వే, ఫిలిప్పీన్స్ రాయబారులు మరణించారు.
- 2015, మే 8: బ్రిటన్ ఎన్నికలలో కన్జర్వేటివ్ పార్టీ ఆధిక్యం సాధించింది. మొత్తం 650 స్థానాలకుగాను 331 స్థానాలను, లేబర్ పార్టీ 232 స్థానాలను పొందింది.
- 2015, మే 11: బ్రిటన్ మంత్రివర్గంలో భారత సంతతికి చెందిన ప్రీతీ పతేల్‌కు కేబినెట్ హోదా లభించింది.
- 2015, మే 13: కరాచీలో ఉగ్రవాదుల దాడిలో 45 మంది మరణించారు.
- 2015, మే 13: బ్రిటన్‌లో ఈలింగ్ కౌన్సిల్ మేయరుగా భారత సంతతికి చెందిన మహిళ ఎన్నికైంది.
- 2015, మే 14: నేషనల్ జియోగ్రఫిక్-బి పోటీలో ఇండో-అమెరిక విద్యార్థి కరణ్ మీనన్ విజేతగా నిలిచాడు.
- 2015, మే 15: ప్రముఖ గాయకుడు, గిటారిస్ట్ బీబీ కింగ్ మరణం.
- 2015, మే 16: ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీకి ఆ దేశ న్యాయస్థానం మరణశిక్ష విధించింది.
- 2015, మే 19: అతి తక్కువ సమయంలో 10లక్షల మంది అభిమానులను సంపాదించి బరాక్ ఓమాబా రికార్డు సృష్టించారు.
- 2015, మే 24: అంతర్జాతీయ వేదిక బ్యూరో ఆఫ్ రీసైక్లింగ్ సంస్థ అధ్యక్షుడిగా రంజిత్ సింగ్ భక్షి ఎన్నికయ్యారు.
- 2015, మే 24: మూడు నిమిషాల్లో 105 సెల్ఫీలు తీసి హాలీవుడ్ నటుడు డ్వేన్ జేమ్స్ గిన్నిస్ రికార్డు సృష్టించాడు.
- 2015, మే 24: గణిత మరియు ఆర్థికవేత్త జాన్ నాష్ మరణం.
- 2015, మే 26: తొలి ఏక పరమాణువు డయోడ్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు.
- 2015, మే 28: ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటి ప్రెస్‌చే ఈ ఏడాది పిల్లల పదంగా # (హ్యాష్ త్యాగ్) ఎంపికైంది.
జూన్ 2015:
- 2015, జూన్ 1: పెట్రోల్ ట్యాంకర్ అదుపుతప్పి బస్టాండులోకి వెళ్ళడంతో నైజీరియాలో 69మంది సజీవ దహనం అయ్యారు.
- 2015, జూన్ 2: ప్రపంచంలో అత్యంత గొప్ప చారిత్రక నిర్మాణాల్లో పెరూలోని మాచుపిచ్చు తొలిస్థానం దక్కించుకుంది.
- 2015, జూన్ 2: చైనాలో జాన్‌ట్సీ నదిలో పడవ బోల్టాపడి 450+ మంది మరణించారు.
- 2015, జూన్ 4: మారిషస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా అమీనా గురిబ్ ఫకిమ్ నియమితులైనారు.
- 2015, జూన్ 11:ప్రముఖ బ్రిటీష్ నటుడు రోన్‌మూడి మరణం.
- 2015, జూన్ 28: ప్రపంచ 16వ సంస్కృత సదస్సు బాంకాక్‌లో ప్రారంభమైంది.
- 2015, జూన్ 30: ఇండోనేషియాలో మిలటరీ విమానం కూలి 45 మంది మరణించారు.
జూలై 2015:
- 2015, జూలై 2: అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపిన వ్యోమగామిగా రష్యాకు చెందిన గెన్నడీ పడాల్కా రికార్డు నెలకొల్పాడు.
- 2015, జూలై 2: ఇండో-అమెరికన్-- ఆర్.పాల్‌సింగ్‌కు ప్రపంచ వ్యవసాయ పురస్కారం ప్రకటించబడింది.
- 2015, జూలై 3: తానా 20వ మహాసభలు డెట్రాయిట్‌లో ప్రారంభమయ్యాయి.
- 2015, జూలై 3: ఫిలిప్పీన్స్ పడవ ప్రమాదంలో 41+ మరణించారు.
- 2015, జూలై 3: గ్వాటెమాలలో ఫ్యూగో అగ్నిపర్వతం బద్దలైంది.
- 2015, జూలై 5: గ్రీసులో యూరో షరతులను ఒప్పుకోవాలా వద్దా అనే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది.
- 2015, జూలై 6: గ్రీసు ప్రజాభిప్రాయ సేకరణలో "ఎస్" (యూరో షరతులను ఒప్పుకోవాలి)కు మెజారిటి లభించింది.
- 2015, జూలై 6: గ్రీసు ప్రధానమంత్రి అలెక్సిస్ సిప్రాస్ రాజీనామా చేశారు.
- 2015, జూలై 6: కాలిఫోర్నియాలో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీయార్ విగ్రహం ఆవిష్కరింబడింది.
- 2015, జూలై 6: నైజీరియాలో ఉగ్రవాదుల బాంబుపేలుళ్ళలో 51మంది మరణించారు.
- 2015, జూలై 7: ప్రపంచంలో అత్యంతవృద్ధిడిగా పేరుపొందిన జపాన్‌కు చెందిన శాకరి మొమొయి మరణించాడు.
- 2015, జూలై 14: ప్లూటోకు చేరువగా వెళ్ళిన అంతరిక్షనౌక న్యూ హోరైజాన్స్.
- 2015, జూలై 23: భౌతిక శాస్త్రవేత్త-- పీటర్ హిగ్స్‌కు రాయల్ సొసైటి కొప్లే పతకం ప్రకటించింది.
- 2015, జూలై 23: ఫార్చ్యున్-500లో వాల్‌మార్ట్ కంపెని తొలి స్థానం పొందింది.
ఆగస్టు 2015:
- 2015, ఆగస్టు 5: ప్రపంచంలో అత్యధికంగా ఆర్జించే నటులలో రాబర్ట్ డౌనీ జూనియర్ ప్రథమ స్థానంలో, జాకీ చాన్ రెండో స్థానంలో నిలిచారు.
- 2015, ఆగస్టు 6: సూయజ్ కాలువకు సమాంతరంగా మరో కొత్త కాలువ ప్రారంభించబడింది.
- 2015, ఆగస్టు 12: ఫోర్బ్స్ సాంకేతిక దిగ్గజాల జాబితాలో బిల్ గేట్స్ కు అగ్రస్థానం లభించింది. భారత్ తరఫున అజీం ప్రేంజీకి ప్రథమస్థానం.
- 2015, ఆగస్టు 17: థాయిలాండ్ రాజధాని బాంకాక్‌లోని బ్రహ్మ దేవాలయంలో పేలుడు సంభవించి 27 మంది మరణించారు.
- 2015, ఆగస్టు 20: దేశంలో ఆర్థిక సంక్షోభం వల్ల గ్రీసు ప్రధానమంత్రి అలెక్సిస్ సిప్రాస్ రాజీనామా చేశారు.
- 2015, ఆగస్టు 20: అత్యంత సంపన్నుడైన యువ కుబేరుడిగా మార్క్ జుకల్‌బర్గ్ ప్రథమస్థానంలో నిలిచాడు.
- 2015, ఆగస్టు 21: శ్రీలంక ప్రధానమంత్రిగా రణిల్ విక్రమసింఘే పదవిచేపట్టారు.
- 2015, ఆగస్టు 25: సిరియాలో యునెస్కో గుర్తింపు పొందిన ప్రాచీన ఆలయాన్ని ఐఎస్ తీవ్రవాదులు కూల్చివేశారు.
సెప్టెంబరు 2015:
- 2015, సెప్టెంబరు 4: ప్రపంచంలోనే అతి పొట్టివాడిగా పేరుపొందిన చంద్ర బహదూర్ డాంగీ (నేపాల్) మరణం.
- 2015, సెప్టెంబరు 12: మక్కాలో క్రేను ప్రమాదంలో 87 మంది మరణించారు.
- 2015, సెప్టెంబరు 20: నేపాల్‌లో కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చింది. (37 విభాగాలు, 304 ప్రకరణలు, 7 పట్టీకలు)
- 2015, సెప్టెంబరు 21: దక్షిణాఫ్రికాలోని రస్టెన్‌బర్గ్ నగరంలో మహాత్మాగాంధీ విగ్రహం ఆవిష్కరించారు.
- 2015, సెప్టెంబరు 24: మినా (సౌదీ అరేబియా)లో హజ్ యాత్రలో తొక్కిసలాట జరిగి 700+ మరణించారు.
అక్టోబరు 2015:
- 2015, అక్టోబరు 5: 2015 సంవత్సరపు వైద్యశాస్త్ర నోబెల్ బహుమతులు ఇలియం క్యాంబెల్, సతోహి ఒమురా, యుయు లకు ప్రకటించబడింది.
- 2015, అక్టోబరు 5: ట్విట్టర్ శాశ్వత CEOగా జాక్ డోర్పే నియమితులైనారు.
- 2015, అక్టోబరు 6: 2015 సంవత్సరపు భౌతికశాస్త్ర నోబెల్ బహుమతి ఆర్థర్ మెక్ డొనాల్డ్,తకాకి కజితలకు ప్రకటించబడింది.
- 2015, అక్టోబరు 8: 2015 సంవత్సరపు సాహిత్య నోబెల్ బహుమతి స్వెత్లానా అలెక్సివిచ్ కు ప్రకటించబడింది.
ఇవి కూడా చూడండి: అంతర్జాతీయ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, |
|
science and techonology topics eakada unnaie sir
రిప్లయితొలగించండివార్తలలో వచ్చిన శాస్త్ర-సాంకేతిక రంగాలకు సంబంధించిన ప్రశ్నలు ఆయా పోస్టులలో చూడవచ్చు.
తొలగించండిnovember-december current affairs eakada unnaie sir
రిప్లయితొలగించండిసమయం సరిపోనందున నవంబరు నుంచి సంక్షిప్త వార్తలు ఇక్కడ చేర్చడం లేదండి.
తొలగించండి