12, మార్చి 2014, బుధవారం

తెలంగాణ వార్తలు - 2014 (Telangana News - 2014)

తెలంగాణ వార్తలు 2014 (Telangana News 2014)

ఇవి కూడా చూడండి:ఆంధ్రప్రదేశ్ వార్తలు-2014జాతీయ వార్తలు-2014అంతర్జాతీయ వార్తలు-2014క్రీడావార్తలు-2014

జనవరి 2014:
  • 2014, జనవరి 7: జాతీయస్థాయి పైకా పోటీలు మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రారంభమయ్యాయి. 
  • 2014, జనవరి 9: మహబుబ్‌నగర్‌లో జరుగుతున్న పైకా జాతీయ పోటీలలో హాజీబాబా రాష్ట్రానికి తొలి స్వర్ణం అందించాడు. 
  • 2014, జనవరి 14: హైదరాబాదుకు చెందిన ఫాస్ట్ బౌలర్ అండర్-19 ప్రపంచకప్ క్రికెట్‌లో పాల్గొనే భారతజట్టులో స్థానం పొందాడు. 
  • 2014, జనవరి 18: గోదావరి ఖనికి చెందిన రష్మీ మిస్ ఆంధ్రప్రదేశ్ గా ఎంపికైంది.
  • 2014, జనవరి 19: మెదక్-అక్కన్నపల్లి నూతన రైలుమార్గానికి మెదక్‌లో శంకుస్థాపన జరిగింది. 
  • 2014, జనవరి 20: హైదరాబాదులోని శాసనసభ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించబడింది. 
  • 2014, జనవరి 20: సర్దార్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమి డైరెక్టరుగా అరుణా బహుగుణ నియమితులైనారు. 
  • 2014, జనవరి 21: గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఎం) వేతనం రూ 3000 నుంచి రూ 6000కు పెంచబడింది.
  • 2014, జనవరి 25: హైదరాబాదులో పంజాగుట్టలోని తనిష్క్ బంగారు ఆభరణాల దుకాణంలో రూ. 23 కోట్ల విలువైన ఆభరణాల చోరీ జరిగింది.
  • 2014, జనవరి 26: మావోయిస్టుల చేతుల్లో హతుడైన వరప్రసాద్‌కు రాష్ట్రంలోనే తొలిసారిగా అశోకచక్ర అవార్డు లభించింది. 
ఫిబ్రవరి 2014:
  • 2014, ఫిబ్రవరి 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 
  • 2014, ఫిబ్రవరి 7: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా కె.కేశవరావు, కెవిపి రామచంద్రారెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి, ఎంఏ ఖాన్, తోట సీతారామలక్ష్మి, గరికపాటి మోహన్ రావు ఎన్నికయ్యారు. 
  • 2014, ఫిబ్రవరి 8: తెలుగువ్యక్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైనారు. 
  • 2014, ఫిబ్రవరి 10: మాజీ మంత్రి చల్లా రాంభూపాల్ రెడ్డి మరణించారు. 
  • 2014, ఫిబ్రవరి 10: రామోజీ ఫిలింసిటికి "నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్" లభించింది. 
  • 2014, ఫిబ్రవరి 12: రాష్ట్ర ఉప లోకాయుక్తగా మహబూబ్‌నగర్ జిల్లా న్యాయమూర్తి టి.గంగిరెడ్డి నియమించబడ్డారు.
  • 2014, ఫిబ్రవరి 13: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (తెలంగాణ ఏర్పాటు) బిల్లు లోకసభలో ప్రవేశపెట్టబడింది. 
  • 2014, ఫిబ్రవరి 18: లోకసభలో తెలంగాణ ఏర్పాటు బిల్లుకు ఆమోదం లభించింది. 
మార్చి 2014:
  • 2014, మార్చి 1: తెలంగాణ ఏర్పాటు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది. 
  • 2014, మార్చి 1:  రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడింది.
  • 2014, మార్చి 1: భాజపా నాయకుడు బంగారు లక్ష్మణ్ మరణించారు.
  • 2014, మార్చి 2: పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురయ్యే తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది.
  • 2014, మార్చి 3: రాష్ట్రంలో పురపాలక సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబడింది. 
  • 2014, మార్చి 3: వరంగల్‌కు చెందిన హృద్రోగ నిపుణుడు డాక్టర్ రామక శ్రీనివాస్ లిమ్కాబుక్ రికార్డులో స్థానం పొందినారు- ఒకే రోజు 4వేల మందికి శిక్షణ ఇచ్చినందుకు.
  • 2014, మార్చి 3: గవర్నరు కోటాలో రాష్ట్ర విధానసభకు ముగ్గురు ఎమ్మెల్సీలు నియమించబడ్డారు (కంతేటి సత్యనారాయణ, నంది ఎల్లయ్య, రత్నాబాయి) 
  • 2014, మార్చి 4: దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ జూన్ 2, 2014 నుంచి అధికారికంగా అమలులోకి వస్తుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. 
  • 2014, మార్చి 8: తెలంగాణ రాష్ట్ర సీపీఎం తొలి కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం ఎన్నికయ్యారు. 
  • 2014, మార్చి 10: కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత నలిమెల భాస్కర్‌కు 2013 సం.కిగాను అనువాద ప్రక్రియలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించబడింది.
  • 2014, మార్చి 11: తెలంగాణ పిసిసి తొలి అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య నియమితులైనారు. 
  • 2014, మార్చి 15: ఆదిలాబాదు ఎంపీగా, జడ్పీ చైర్మెన్‌గా పనిచేసిన నర్సింహారెడ్డి మరణించారు. 
  • 2014, మార్చి 18: మాజీ మంత్రి కొండాసురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తెరాసలో చేరారు. 
  • 2014, మార్చి 23: వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కంబంపాటి లక్ష్మారెడ్డి మరణించారు. 
  • 2014, మార్చి 24: వరంగల్ జిల్లాకు చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు తిరునగరి వెంకటాచారి మరణించారు.
  • 2014, మార్చి 24: రాష్ట్రంలో తొలి మహిళా బ్యాంకును అమీర్‌పేట్‌లో ప్రారంభించారు. 
  • 2014, మార్చి 28: రాష్ట్ర బీసి సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలుగుదేశం పార్టీలో చేరారు. 
  • 2014, మార్చి 30: రాష్ట్రంలో నగరపాలక సంస్థల మరియు పురపాలక సంఘాల ఎన్నికలు జరిగాయి. 
ఏప్రిల్ 2014:
  • 2014, ఏప్రిల్ 2: తెలంగాణలోని 17 లోక్‌సభ, 119 శాసనసభ ఎన్నికలకై ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది.
  • 2014, ఏప్రిల్ 6: ఎంపీటీసి, జడ్పీటీసి ఎన్నికల తొలి విడత పోలింగ్ జరిగింది.
  • 2014, ఏప్రిల్ 9: మాజీ కేంద్రమంత్రి ఆలె నరేంద్ర మరణించారు.
  • 2014, ఏప్రిల్ 11: ఎంపీటీసి, జడ్పీటీసి ఎన్నికల రెండవ విడత పోలింగ్ జరిగింది. 
  • 2014, ఏప్రిల్ 19: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి మరణించారు. 
  • 2014, ఏప్రిల్ 30: రాష్ట్రంలో 17 లోకసభ, 119 శాసనసభ నియోజకవర్గాలలో ఎన్నికలు జరిగాయి. 
మే 2014:
  • 2014, మే 4: సిద్ధిపేటలో తెలంగాణ రచయితల సంఘం ఆవిర్భవించింది. 
  • 2014, మే 11: మాజీ మావోయిస్టు, టీఆర్‌ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు కొనపురి రాములు హత్య జరిగింది.
  • 2014, మే 12: పురపాలక సంఘం ఎన్నికల ఫలితాలు ప్రకటించబడ్డాయి- తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలలో విజయం సాధించింది. 
  • 2014, మే 13: ఎంపీటీసి, జడ్పీటీసి ఎన్నికల కౌంటింగ్ జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్, తెరాసలు అత్యధిక స్థానాలు గెలుచుకున్నాయి.
  • 2014, మే 13: రాష్ట్రంలో తొలిసారిగా డబుల్ డెక్కర్ రైలు కాచిగూడ నుంచి ప్రారంభమైంది.
  • 2014, మే 14: మక్తల్ మాజీ ఎమ్మెల్యే నరసింహులు నాయుడు మరణించారు. 
  • 2014, మే 16: శాసనసభ ఎన్నికలలో తెలంగాణలో తెరాస పూర్తి మెజారిటి సాధించింది. (నియోజకవర్గాల వారీగా శాసనసభ్యుల పట్టిక). 
  • 2014, మే 19: ప్రముఖ కార్టూనిస్టు కంబాలపల్లి శేఖర్ మరణించారు. 
  • 2014, మే 25: ఎవరెస్టును అధిరోహించిన పిన్న వయస్కురాలిగా తెలంగాణకు చెందిన మాలావత్ పూర్ణ ప్రపంచ రికార్డు సృష్టించింది. 
  • 2014, మే 28: పోలవరం ముంపు ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వు జారీచేయబడింది. 
జూన్ 2014:
  • 2014, జూన్ 1: తెలంగాణ రాష్ట్ర తాత్కాలిక డిజిపిగా అనురాగ్ శర్మ నియమితులైనారు. 
  • 2014, జూన్ 1: తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వ కార్యదర్శిగా రాజీవ్ శర్మ నియమితులైనారు. 
  • 2014, జూన్ 2: భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది. 
  • 2014, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్ రావు పదవీబాధ్యతలు స్వీకరించారు. (అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాబితా)
  • 2014, జూన్ 3: తెరాస పార్లమెంటరీ పార్టీ నేతగా కె.కేశవరావు, లోకసభలో తెరాస పక్షనేతగా జితేందర్ రెడ్డి నియమితులైనారు. 
  • 2014, జూన్ 3: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా జానారెడ్డి, శాసనమండలి పక్షనేతగా డి.శ్రీనివాస్  నియమితులైనారు. 
  • 2014, జూన్ 6: తెలంగాణ తొలి శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా కుందూరు జానారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. 
  • 2014, జూన్ 7: తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కొత్త రకం కంది వంగడం RGT-4 (రెడ్ గ్రామ్‌ తాండూరు-4) సృష్టించారు. 
  • 2014, జూన్ 7: తెలంగాణ శాసనమండలి తొలి చైర్మెన్‌గా నేతి విద్యాసాగర్ రావు నియమితులైనారు.
  • 2014, జూన్ 8: హిమాచల్ ప్రదేశ్‌లో బియాస్ నదిలో హైదరాబాదు కళాశాలకు చెందిన 24 విద్యార్థులు కొట్టుకొపోయారు. 
  • 2014, జూన్ 9: కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం ఆరేపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో 12 గురు మరణించారు. 
  • 2014, జూన్ 10: తెలంగాణ శాసనసభ పక్షనేతగా ఎర్రబెల్లి దయాకర్ రావు నియమితులైనారు. 
  • 2014, జూన్ 10: తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకరుగా సిరికొండ మధుసూధనచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 
  • 2014, జూన్ 11: తెలంగాణలోని అన్ని వాహనాలకు TS కోడ్ ఉండాలని ప్రభుత్వం ప్రకటించింది.
  • 2014, జూన్ 12: పద్మాదేవేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటి స్పీకరుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 
  • 2014, జూన్ 14: తెలుగు సినీనటి తెలంగాణ శకుంతల (కడియాల శకుంతల) మరణించారు. 
  • 2014, జూన్ 16: బోనాలు, బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర ఉత్సవాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 
  • 2014, జూన్ 20: గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నాయిని నర్సింహారెడ్డి, సబావత్ రాములునాయక్ నియమితులైనారు.
  • 2014, జూన్ 20: తెలంగాణ రాష్ట్ర అడ్వకెట్ జనరల్‌గా కె.రామకృష్ణారెడ్డి నియమితులైనారు. 
  • 2014, జూన్ 24: పి.వి.నరసింహారావు జయంతిని జూన్ 28 తేదిని రాష్ట్ర ఉత్సవంగా గుర్తిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. 
  • 2014, జూన్ 23: రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో విమాన తయారీ పరికరాల పరిశ్రమకు కేసిఆర్ శంకుస్థాపన చేశారు. 
  • 2014, జూన్ 25: ఇద్దరు ఎమ్మెల్యేలు, 9 ఎమ్మెల్సీలు తెరాసలో చేరారు. 
  • 2014, జూన్ 24: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గామా రే టెలిస్కోప్‌ను హైదరాబాదుకు చెందిన ఈసీఐఎల్ సంస్థ తయారుచేసింది. 
  • 2014, జూన్ 24: ఎంఐఎం ను తెలంగాణ రాష్ట్ర పార్టీగా ఎన్నికల సంఘం గుర్తించింది. 
  • 2014, జూన్ 30: డిండి రిజర్వాయర్‌లో ఈతకు వెళ్ళి ఐదుగురు మరణించారు.
    జూలై 2014:
  • 2014, జూలై 2: తెలంగాణ శాసనమండలి చైర్మెన్‌గా స్వామిగౌడ్ ఎన్నికయ్యారు. 
  • 2014, జూలై 3: నగర పాలక సంస్థ మేయర్ల, పురపాలక/నగర పాలక సంఘాల చైర్మెన్ల ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అత్యధిక స్థానాలు సాధించింది. 
  • 2014, జూలై 3: తెలంగాన రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మెన్‌గా అల్లం నారాయణ నియమితులైనారు. 
  • 2014, జూలై 5: తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా పరిషత్తు ఎన్నికలలో తెరాస 6, కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో చైర్మెన్ స్థానాలు కైవసం చేసుకున్నాయి. (ఖమ్మం జిల్లాలో ఎన్నికలు జరుపబడలేదు, రంగారెడ్డి జిల్లాలో ఎన్నిక వాయిదా పడింది). 
  • 2014, జూలై 6: దక్షిణ భారత సుడోకు చాంప్‌లో మెదక్ జిల్లా డిసిసిబి చైర్మెన్ ఎం.జైపాల్ రెడ్డి అగ్రస్థానం పొందారు. 
  • 2014, జూలై 16: మెదక్ జిల్లాకు చెందిన ప్రముఖ శిల్పి బాలరత్నం మరణించారు. 
  • 2014, జూలై 17: మాజీ కేంద్రమంత్రి కె.కమలకుమారి మరణించారు. 
  • 2014, జూలై 19: తెలుగు అకాడమీని తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ పరిధిలోకి మార్చింది. 
  • 2014, జూపై 17: బాల్‌బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత లియాఖత్ అలీ ఇక్బాల్ మరణించాడు. 
  • 2014, జూలై 18: జాతీయ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన హర్ష భరతకోటి రజతపతకం సాధించాడు. 
  • 2014, జూలై 22: ఉపాధిహామీ పథకంలో కూలీలకు కనీస వేతనం రూ.169 ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
  • 2014, జూలై 23: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియామీర్జాను ఎంపికచేశారు. 
  • 2014, జూలై 24: మెదక్ జిల్లాలో కాపలాలేని రైల్వే గేటువద్ద పాఠశాల బస్సు రైలును ఢీకొనడంతో 20 మంది విద్యార్థులు మరణించారు. 
  • 2014, జూలై 24: ప్రముఖ రచయిత చేకూరి రామారావు మరణించారు.
  • 2014, జూలై 30: అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం 8వ మహాసభలు వరంగల్‌లో ప్రారంభమయ్యాయి.
    ఆగస్టు 2014:
  • 2014, ఆగస్టు 1: 2013 సంవత్సరలు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతీ పురస్కారం బర్మా తెలుగు సంఘానికి, 2014 సంవత్సరపు పురస్కారం చెన్నై తెలుగు సమాఖ్యకు ప్రకటించారు.
  • 2014, ఆగస్టు 3: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పరుపల్లి కశ్యప్ 2014 కామన్వెల్త్ క్రీడలలో స్వర్ణపతకం సాధించాడు. 
  • 2014, ఆగస్టు 4: తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి మరోసారి నియమితులైనారు. 
  • 2014, ఆగస్టు 7: హైదరాబాదు ఎగ్జిబిషన్ సొసైటి అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ ఎన్నికయ్యారు. 
  • 2014, ఆగస్టు 7: ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మెన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన గడిపల్లి కవిత ఎన్నికయ్యారు. 
  • 2014, ఆగస్టు 13: తెలంగాణ రాష్ట్ర  బీసిల మహాసభ హైదరాబాదులో జరిగింది. 
  • 2014, ఆగస్టు 13: దాశరథి పేరిట ఏటా పురస్కారాలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. 
  • 2014, ఆగస్టు 19: తెలంగాణ రాష్ట్రమంతటా సమగ్రసర్వే నమోదు కార్యక్రమం జరిగింది. 
  • 2014, ఆగస్టు 20: సీనియర్ పాత్రికేయుడు మహ్మద్ తాజుద్దీన్ ఖాన్ మరణించారు. 
  • 2014, ఆగస్టు 21: భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాదు వచ్చారు. 
  • 2014, ఆగస్టు 26: కరీంనగర్ జిల్లాకు చెందిన సీహెచ్ విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నరుగా నియమించబడ్డారు. 
  • 2014, ఆగస్టు 31: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే కొండవీటి గుర్నాథరెడ్డి మరణించారు.
  • సెప్టెంబరు 2014:
  • 2014, సెప్టెంబరు 1: వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మరో ముగ్గురు ఎమ్మెల్సీలు తెరాసలో చేరారు.
  • 2014, సెప్టెంబరు 3: పాలమూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలు, కళాకారిణి అయిన జంగమ్మ మరణించారు. 
  • 2014, సెప్టెంబరు 6: సానియామీర్జా అమెరికన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ సాధించింది. 
  • సెప్టెంబరు 9: కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ అధికార భాషా దినోత్సవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. 
  • 2014, సెప్టెంబరు 9: వరంగల్‌లో కాళోజీ కళాక్షేత్రం నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. 
  • 2014, సెప్టెంబరు 13: మెదక్ లోకసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. 
  • 2014, సెప్టెంబరు 13: సికింద్రాబాదులోని గాంధీ మెడికల్ కళాశాల వజ్రోత్సవాలు నిర్వహించబడ్డాయి. 
  • 2014, సెప్టెంబరు 16: మెదక్ లోకసభ ఉప ఎన్నికలో తెరాస విజయం సాధించింది. 
  • 2014, సెప్టెంబరు 17: నల్గొండ జిల్లా భువనగిరి మండలం చందుపట్లలో నిజాం కాలం నాటి వెండినాణేలు బయటపడ్డాయి. 
  • 2014, సెప్టెంబరు 20: కోఠి మహిళా కళాశాల 90వ వార్షికోత్సవం జరుపుకుంది. 
  • 2014, సెప్టెంబరు 25: కాళోజీ పేరిట వరంగల్‌లో ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. 
అక్టోబరు 2014:
  •  2014, అక్టోబరు 6: హైదరబాదులో ప్రపంచ మేయర్ల సదస్సు ప్రారంభమైంది.
  • 2014, అక్టోబరు 7: వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యుడు కుందూరు ప్రభాకర్ రెడ్డి ప్రముఖ రేడియోలాజిస్టుగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. 
  • 2014, అక్టోబరు 7: కొమురం భీం జాతీయ పురస్కారం ప్రముఖ రచయిత సుద్దాల అశోక్‌కు లభించింది. 
  • 2014, అక్టోబరు 15: మహబూబ్‌నగర్ జిల్లా శ్రీరంగాపూర్ ఆలయంలో 50 కిలోల పంచలోహ విగ్రహం చోరోకి గురైంది. 
  • 2014, అక్టోబరు 21: ఉద్యోగుల వైద్య బిల్లులను చెల్లించుటలో ఉన్న పరిమితులను తెలంగాణ ప్రభుత్వం తొలగించింది. 
  • 2014, అక్టోబరు 25: ఆరెస్సెస్ ప్రముఖుడు టీవీ దేశ్‌ముఖ్ మరణించారు. 
  • 2014, అక్టోబరు 25: నల్లమల టైగర్ రిజర్వ్‌కు అమ్రాబాదు పేరు పెట్టారు.
  • 2014, అక్టోబరు 27: కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ సమరయోధుడు బోయినపల్లి వెంకటరామారావు మరణించారు.
    నవంబరు 2014:
  • 2014, నవంబరు 2: తెలంగాణ రాష్ట్రస్థాయి పాఠశాలల అథ్లెటిక్స్ పోటీలు ఖమ్మంలో ప్రారంభమయ్యాయి.
  • 2014, నవంబరు 4: వనపర్తిలో రాష్ట్రస్థాయి హాకీపోటీలు (అండర్-17) ప్రారంభమయ్యాయి. 
  • 2014, నవంబరు 5: తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్‌ను శాసనసభలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టారు.. 
  • 2014, నవంబరు 5: సామాజిక పింఛన్ల పథకానికి తెలంగాణ ప్రభుత్వం "ఆసరా" గా పేరుపెట్టింది. 
  • 2014, నవంబరు 5: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్‌గా నాగిరెడ్డి నియమితులైనారు. 
  • 2014, నవంబరు 7: మార్కెట్ కమిటీలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వును హైకోర్టు కొట్టివేసింది. 
  • 2014, నవంబరు 8: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో ఆసరా పథకాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రారంభించారు. 
  • 2014, నవంబరు 8: తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి "మిషన్ కాకతీయ" పేరును ఖరారు చేశారు.
  • 2014, నవంబరు 9: బండారు దత్తాత్రేయకు కేంద్ర మంత్రిపదవి లభించింది. 
  • 2014, నవంబరు 9: తెలంగాణ రాష్ట్రస్థాయి మొదటి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు హన్మకొండలో ప్రారంభమయ్యాయి. 
  • 2014, నవంబరు 17: తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, రాష్ట్ర జంతువుగా జింక, రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టు, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును ముఖ్యమంత్రి ఖరారు చేశారు.
  • 2014, నవంబరు 18: సుద్దాల అశోక్ తేజకు గురజాడ విశిష్ట పురస్కారం ప్రకటించబడింది. 
  • 2014, నవంబరు 19: మెదక్ జిల్లా పెద్దమాసానిపల్లిలో ఔషద ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటుకు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామస్తులు బహిష్కరించారు.
  • 2014, నవంబరు 21: శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం డొమెస్టిక్ టర్మినల్‌కు ఎన్టీయార్ పేరుపెట్టాలనే నిర్ణయానికి తెలంగాణ శాసనసభ అభ్యంతరం వ్యక్తం చేసింది. 
  • 2014, నవంబరు 29: బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి నర్సయ్య మరణించారు. 
డిసెంబరు  2014:
  • 2014, డిసెంబరు 5: తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బాలాసాహెబ్ భోంస్లే నియమితులైనారు. 
  • 2014, డిసెంబరు 10: తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పథకం ప్రారంభమైంది. 
  • 2014, డిసెంబరు 13: భాజపా తెలంగాణ రాష్ట్ర మహిళామోర్చా అధ్యక్షురాలిగా జి.పద్మారెడ్డి నియమితులైనారు.
  • 2014, డిసెంబరు 13: తెలంగాణ చీఫ్ విప్‌గా కొప్పుల ఈశ్వర్ నియమితులైనారు. గంప గోవర్థన్, గొంగిడి సునీతారెడ్డిలు విప్‌లుగా నియమితులైనారు. 
  • 2014, డిసెంబరు 15: సంగీత దర్శకుడు చక్రి (చక్రధర్ గిల్లా) మరణించారు. 
  • 2014, డిసెంబరు 16: తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా ఆరుగురు స్థానం పొందారు. (తుమ్మల నాగేశ్వరరావు, చెర్లకోల లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, చందూలాల్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి) (తెలంగాణ మంత్రివర్గం-శాఖలు)
  • 2014, డిసెంబరు 16: సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శాసనసభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. 
  • 2014, డిసెంబరు 17: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ తొలి చైర్మెన్‌గా ఘంటా చక్రవర్తి నియమితులైనారు. 
  • 2014, డిసెంబరు 20: దేశవ్యాప్తంగా "జాతీయ వారసత్వ పట్టణాభివృద్ధి, పునరుత్తేజిత యోజన- హృదయ్" యోజన పథకం క్రింద ఎంపికచేసిన 12 నగరాలలో తెలంగాణ నుంచి వరంగల్ ఎంపికైంది. 
  • 2014, డిసెంబరు 22: తెలంగాణకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు జి.వెంకటస్వామి మరణించారు. 
  • 2014, డిసెంబరు 26: 2015 రిపబ్లిక్ దినోత్సవాల వేడుకల్లో తెలంగాణ శకటానికి చోటు దక్కింది. 
  • 2014, డిసెంబరు 29: స్వాతంత్ర్య సమరయోధుడు రాపోలు ప్రతాప్ రెడ్డి మరణించారు. 
  • 2014, డిసెంబరు 30: నల్గొండ మండలం మేళ్ళచెరువు మండలం వెల్గటూరులో థర్మల్ ప్లాంటు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. 
  • 2014, డిసెంబరు 30: స్వాతంత్ర్య సమరయోధుడు గుత్తా సుబ్రహ్మణ్యం మరణించారు.

Tags: Telugu Vaarthalu, తెలుగు వార్తలు, Telangana News in Telugu,

1 కామెంట్‌:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక