21, ఆగస్టు 2013, బుధవారం

సీ.హెచ్.విద్యాసాగర్ రావు (Ch.Vidhyasagar Rao)

 సీ.హెచ్.విద్యాసాగర్ రావు
జననంఫిబ్రవరి 12, 1942
జిల్లాకరీంనగర్ జిల్లా
పదవులుకేంద్ర మంత్రి, 2 సార్లు ఎంపి, 3 సార్లు ఎమ్మెల్యే, మహారాష్ట్ర గవర్నరు,
నియోజకవర్గంకరీంనగర్ లో/ని, మెట్‌పల్లి అ/ని,
భారతీయ జనతా పార్టీకి చెందిన రాష్ట్ర ప్రముఖులలో ఒకరైన సీహెచ్.విద్యాసాగర్ రావు (చెన్నమనేని విద్యాసాగర్ రావు) 1942, ఫిబ్రవరి 12న శ్రీనివాసచారి, చంద్రమ్మ దంపతులకు కరీంనగర్ జిల్లాలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించి న్యాయవాద వృత్తి చేపట్టిన విద్యాసాగర్ రావు 1980లో తొలిసారిగా కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 1985లో మెట్‌పల్లి శాసనసభ నియోజకవర్గంలో తొలిసారి గెలుపొంది రాష్ట్ర శాసనసభలో ఆడుగుపెట్టిన విద్యాసాగర్ రావు మొత్తం 3 సార్లు శాసనసభ్యుడిగాను, రెండు సార్లు లోకసభ సభ్యుడిగాను ఎన్నికయ్యారు. అటల్ బిహారీ వాజపేయి నేతృతంలోని ఎన్.డి.ఏ.ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. స్వశక్తితో ఎదిగి రాజకీయాలలో రాణించిన నాయకుడైన విద్యాసాగర్ రావు 2004లో మరియు 2006 ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనంతో ఓడిపోయారు. 2009 శాసనసభ ఎన్నికలలో వేములవాడ నుంచి పోటీచేసిననూ విజయం లభించలేదు. 2014, ఆగస్టు 26న మహారాష్ట్ర గవర్నరుగా నిమమించబడ్డారు.

బాల్యం, విద్యాభ్యాసం:
చెన్నమనేని విద్యాసాగర్ రావు 1942, ఫిబ్రవరి 12న కరీంనగర్ జిల్లాలో జన్మించి ప్రాథమిక విద్యాభ్యాసం స్థానికంగా అక్కడే పూర్తిచేశారు. ఉన్నత విద్యను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తిచేశారు. బి.యస్సీ, ఎల్.ఎల్.బి పట్టాలు పొంది న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రముఖ నాయకుడిగా ఎదిగారు.

రాజకీయ ప్రస్థానం:
విద్యాసాగర్ రావు తొలిసారిగా 1980లో కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుంచి జనతా పార్టీ తరఫున పోటీచేశారు. ఆ ఎన్నికలలో ఓటమి పొందిననూ మునుముందు విజయానికి నాంది పలికింది. 1985లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మెట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికలలో విజయం సాధించి తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తరువాత 1989 మరియు 1994 ఎన్నికలలో కూడా మెట్‌పల్లి నుంచి వరుస విజయాలు సాధించి మొత్తం మూడు పర్యాయాలు శాసనసభ్యుడిగా కొనసాగినారు. 1998లో కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి 12వ లోక్‌సభలో ప్రవేశించారు. పార్లమెంటుకు చెందిన పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ సభ్యుడిగాను పనిచేసినారు.] 1999లో జరిగిన 13వ లోకసభ ఎన్నికలలో కూడా గెలుపొంది కేంద్రంలో వాజపేయి నాయకత్వంలోని ఎన్.డి.ఏ. ప్రభుత్వంలో హోంశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. ఆ తరువాత 2004 మరియు 2006 ఉపఎన్నికలలో కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన కె. చంద్రశేఖర రావు చేతిలో పరాజయం పొందినారు. 2009 శాసనసభ ఎన్నికలలో వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసి సోదరుడు చెన్నమనేని రాజేశ్వరరావు కుమారుడైన సి.హెచ్.రమేష్ చేతిలో పరాజయం పొందినారు.

కుటుంబం:
విద్యాసాగర్ రావు 1972లో వినోదను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు మరియు ఒక కూతురు. ప్రముఖ రాజకీయనేత చెన్నమనేని రాజేశ్వరరావు ఇతని సోదరుడు. 2009లో వేములవాడ నుంచి గెలుపొందిన సి.హెచ్.రమేష్ సోదరుని కుమారుడే. ప్రముఖ ఆర్థికవేత్త సీహెచ్ హన్మంతరావు కూడా వీరి సోదరుడే.

విభాగాలు: తెలంగాణ భాజపా ప్రముఖులు, కరీంనగర్ జిల్లా రాజకీయ నాయకులు, కరీంనగర్ లోకసభ నియోజకవర్గం, 12వ లోకసభ సభ్యులు, 13వ లోకసభ సభ్యులు, కేంద్రమంత్రులు, మెట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం, 1942లో జన్మించినవారు, మహారాష్ట్ర గవర్నర్లు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక