4, జనవరి 2014, శనివారం

ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం (Dharmapuri Assembly Constituency)

ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. 2009 నాటి నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఈ నియోజవర్గంలో 5 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఇది కొత్తగా ఏర్పడింది. ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 5 మండలాలు కలవు.
  • ధర్మపురి
  • గొల్లపల్లి, 
  • వెల్గటూరు, 
  • పెగడపల్లి, 
  • ధర్మారం,

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 కొప్పుల ఈశ్వర్ తెరాస ఎ.లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ
2010* కొప్పుల ఈశ్వర్ తెరాస ఎ.లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ
2014 కొప్పుల ఈశ్వర్ తెరాస ఎ.లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ
2018 కొప్పుల ఈశ్వర్ తెరాస ఎ.లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, జడ్పీ చైర్మెన్ అయిన ఎ.లక్ష్మణ్ కుమార్ పై 1484 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. మొత్తం 193555 ఓట్లలో 127816 (66%) ఓట్లు పోల్ కాగా కొప్పుల ఈశ్వర్‌కు 45848 ఓట్లు, లక్ష్మణ్ కుమార్‌కు 44364 ఓట్లు లభించాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కొప్పుల ఈశ్వర్ శాసనసభ పదవికి రాజీనామా చేయగా 2010, ఫిబ్రవరి 15న స్పీకర్ ఆమోదించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన కొప్పుల ఈశ్వర్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై 18679 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. డిసెంబరు 13, 2014న కొప్పుల ఈశ్వర్ చీఫ్ విప్‌గా నియమితులైనారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున కొప్పుల ఈశ్వర్, భాజపా తరఫున కన్నం అంజయ్య, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పోటీచేశారు. తెరాసకు చెందిన కొప్పుల ఈశ్వర్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై 441 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.



హోం,
విభాగాలు: కరీంనగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక