22, మార్చి 2014, శనివారం

పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం (Patancheru Assembly Constituency)

పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజవర్గంలో 3 మండలాలు కలవు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఇది కొత్తగా ఏర్పడింది. ఈ సెగ్మెంట్ మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. ఈ నియోజకవర్గంలోని అధికాభాగం గ్రేటర్ హైదరాబాదులో భాగంగా ఉన్నది. 2014 & 2018 ఎన్నికలలో తెరాస అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి  ఇక్కడి నుంచి విజయం సాధించారు.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 3 మండలాలు కలవు.
  • జిన్నారం, 
  • పటాన్‌చెరు, 
  • రామచంద్రాపురం,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సపాన్ దేవ్ ఇండిపెండెంట్
2014 గూడెం మహిపాల్ రెడ్డి తెరాస సఫాన్ దేవ్ తెలుగుదేశం పార్టీ
2018 గూడెం మహిపాల్ రెడ్డి తెరాస కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ



2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, డిసిసి అధ్యక్షుడు టి.నందీశ్వర్ గౌడ్ తన సమీప ప్రత్యర్థి, ఇండిపెండెంటుగా పోటీచేసిన సపాన్ దేవ్‌పై 1247 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. పొత్తులో భాగంగా ఈ స్థానం సీపీఎంకు కేటాయించగా, తొలుత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సపాన్ దేవ్ ఇండిపెండెంటుగా పోటీ చేసి గట్టీ పోటీ ఇచ్చారు. నవ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన జె.రాములు ప్రజారాజ్యం పార్టీ తరఫున, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కె.సత్యనారాయణ భాజపా తరఫున పోటీచేశారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన సఫాన్ దేవ్‌పై 18738 ఓట్ల మెజారిటితో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున గూడెం మహిపాల్ రెడ్డి, భాజపా తరఫున పి.కరుణాకర్ రెడ్డి, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన కాటా శ్రీనివాస్ గౌడ్ పోటీచేశారు. తెరాసకు చెందిన గూడెం మహిపాల్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన కాటా శ్రీనివాస్ గౌడ్ పై 37699 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: మెదక్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, మెదక్ లోకసభ నియోజకవర్గం, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక