22, మార్చి 2014, శనివారం

సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం (Sangareddy Assembly Constituency)

సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజవర్గంలో 3 మండలాలు కలవు. ఈ సెగ్మెంట్ మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 3 మండలాలు కలవు.
  • సదాశివపేట్,
  • కొండాపూర్,
  • సంగారెడ్డి,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952



1957



1962 పి.రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ

1967 నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ పి.రామచంద్రారెడ్డి
1972 పి.రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ

1978 నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ పి.రామచంద్రారెడ్డి జనతాపార్టీ
1983 పి.రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ పి.వీరారెడ్డి
1985 పి.రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.సదాశివరెడ్డి ఇండిపెండెంట్
1989 పి.రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ పి.శ్రీనివాస్ గౌడ్ తెలుగుదేశం పార్టీ
1994 కె.సదాశివరెడ్డి తెలుగుదేశం పార్టీ పి.రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1999 కె.సత్యనారాయణ భారతీయ జనతా పార్టీ నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ
2004 తూర్పు జయప్రకాశ్ రెడ్డితెరాస కె.సత్యనారాయణ భారతీయ జనతా పార్టీ
2009 తూర్పు జయప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చింతా ప్రభాకర్ ఇండిపెండెంట్
2014 చింతా ప్రభాకర్ తెరాస జయప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2018 తూర్పు జయప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చింతా ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ

2004 ఎన్నికలు:2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన అభ్యర్థి తూర్పు జయప్రకాష్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కె.సత్యనారాయణపై 17676 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. జయప్రకాష్ రెడ్డికి 71158 ఓట్లు రాగా, సత్యనారాయణకు 53482 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంటుగా పోటీచేసిన చింతా ప్రభాకర్‌పై 6772 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. పొత్తులో భాగంగా ఈ స్థానం తెరాసకు వెళ్ళడంతో తెరాస తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవాజ్‌రెడ్డి పోటీచేయగా, తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించిన పురపాలక సంఘం మాజీ చైర్మెన్ చింతా ప్రభాకర్ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీచేశారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస తరఫున పోటీచేసిన చింతా ప్రభాకర్ తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎమ్మల్యే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన తూర్పు జయప్రకాశ్ రెడ్డిపై 20236 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున చింతాప్రభాకర్, భాజపా తరఫున రాజేశ్వర్ రావు దేశ్‌పాండే, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన తూర్పు జయప్రకాశ్ రెడ్డి పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తూర్పు జయప్రకాశ్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెరాసకు చెందిన చింతా ప్రభాకర్ పై 2589 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.




విభాగాలు: మెదక్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, మెదక్ లోకసభ నియోజకవర్గం, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక