12, ఏప్రిల్ 2014, శనివారం

గీట్ల ముకుందరెడ్డి (Geetla Mukunda Reddy)

గీట్ల ముకుందరెడ్డి
జననంమే 15, 1944
పదవులు3సార్లు ఎమ్మెల్యే
నియోజకవర్గంపెద్దపల్లి అ/ని,
మరణంఏప్రిల్ 19, 2014
గీట్ల ముకుందరెడ్డి కరీంనగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఇతను కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామంలో మే 15, 1944న జన్మించారు. బీఎస్సీ వరకు అభ్యసించిన ముకుందరెడ్డి ప్రారంభంలో ఆరెస్సెస్ కార్యకర్తగా పనిచేసి జన్‌సంఘ్ నేతలతో పరిచయాలు పెంచుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.

రాజకీయ ప్రస్థానం:
1970లో కూనారం సర్పంచిగా, 1976లో కూనారం సింగ్ల్ విండో చైర్మెన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. 1981లో పెద్దపల్లి పంచాయతి సమితి అధ్యక్షుడైనారు. 1984లో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. ఆ తర్వాత ఇదే నియోజకవర్గం నుంచి 1989 కాంగ్రెస్ పార్టీ తరఫున, 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున గెలుపొందినారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి తెలుగుదేశంకు చెందిన విజయరమణారావు చేతిలో ఓడిపోయారు. ముకుందరెడ్డి ఏప్రిల్ 19, 2014న మరణించారు.


విభాగాలు: కరీంనగర్ జిల్లా రాజకీయ నాయకులు, కాల్వశ్రీరాంపూర్ మండలము, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, 6వ శాసనసభ సభ్యులు, 9వ శాసనసభ సభ్యులు, 12వ శాసనసభ సభ్యులు, 2014లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక