10, ఏప్రిల్ 2014, గురువారం

నిజామాబాదు జిల్లా (Nizamabad Dist)

నిజామాబాదు జిల్లా
మండలాలు27
జనాభా
అసెంబ్లీ నియోజకవర్గాలు
రెవెన్యూ డివిజన్లు3
నిజామాబాదు జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లాకు ఉత్తరాన నిర్మల్ జిల్లా, తూర్పున జగిత్యాల జిల్లా, దక్షిణాన కామారెడ్డి జిల్లా, పశ్చిమాన మహారాష్ట సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లా ఉత్తర సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. చరిత్రలో ఈ ప్రాంతం ఇంద్రపురిగా, ఇందూరుగా వ్యవహరించబడింది. క్రీ.పూ 6వ శతాబ్ది నాటి షోడస మహాజనపదాలలో ఒకటైన అశ్మక జనపదం వర్థిల్లిన ప్రాంతంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఆధునిక కాలంలో కౌలాస్, సిర్నాపల్లి, దోమకొండ సంస్థానాధీశూలచే పాలించబడిన ప్రాంతమిది. దేశంలో పొడవైన 44వ నెంబరు జాతీయ రహదారు, నిజామాబాదు- జగదల్‌పూర్ జాతీయ రహదారి, సికింద్రాబాదు- నాందేడ్ రైలుమార్గం జిల్లా గుండా వెళ్ళుచున్నాయి. జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు, 27 మండలాలు కలవు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, అలీసాగర్ లాంటి ప్రాజెక్టులు, డిచ్‌పల్లి ఖిల్లారామాలయం, ఇందూరు నీలకంఠేశ్వరాలయం లాంటి అధ్యాత్మిక క్షేత్రాలు జిల్లాలో కలవు. ప్రముఖ రాజకీయ నాయకుడు గడ్డం గంగారెడ్డి,పిసిసి అధ్యక్షులుగా పనిచేసిన డి.శ్రీనివాస్, శాసనసభ స్పీకరుగా పనిచేసిన కేతిరెడ్డి సురేష్ రెడ్డి ఈ జిల్లాకు చెందినవారు.


విభాగాలు: తెలంగాణ జిల్లాలు, నిజామాబాదు జిల్లా, 


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక