4, ఏప్రిల్ 2014, శుక్రవారం

జనగామ అసెంబ్లీ నియోజకవర్గం (Jangaon Assembly Constituency)

జనగామ అసెంబ్లీ నియోజకవర్గం వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 5 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
  • చేర్యాల,
  • బచ్చన్నపేట,
  • నర్మెట్ట,
  • జనగాం,
  • మద్దూరు,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2004 పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ

2009 పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ ప్రతాప్ రెడ్డి తెరాస
2014 ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెరాస పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ
2018 ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెరాస పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ


2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య తన సమీప ప్రత్యర్థి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ప్రతాప్ రెడ్డిపై236 ఓట్ల స్వల్ప మెజారిటితో విజయం సాధించారు. 13వ శాసనసభలో పొన్నాల లక్ష్మయ్య వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ మంత్రివర్గాలలో స్థానం పొందారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాసకు చెందిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ మంత్రి అయిన పొన్నాల లక్ష్మయ్యపై 32915 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, భాజపా తరఫున KVLN రెడ్డి, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన పొన్నాల లక్ష్మయ్య పోటీచేశారు. తెరాసకు చెందిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డీ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన పొన్నాల లక్ష్మయ్య పై 29568 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

విభాగాలు: వరంగల్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, భువనగిరి లోకసభ నియోజకవర్గం, జనగామ అసెంబ్లీ నియోజకవర్గం,

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక