5, ఏప్రిల్ 2014, శనివారం

ప్రకాష్ జవదేకర్ (Prakash Javadekar)

 ప్రకాష్ జవదేకర్
జననంజనవరి 30, 1950
స్వస్థలంపూణె
పదవులురాజ్యసభ సభ్యుడు, భాజపా అధికార ప్రతినిధి,
ప్రకాష్ జవదేకర్ భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ జాతీయ నాయకుడు. ఇతను జనవరి 30, 1950న మహారాష్ట్రలోని పూణెలో జన్మించారు. 2008లో మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. భాజపా తరఫున అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.

ప్రారంభ జీవనం:
పూణెలో కేశవ్ కృష్ణ జవదేకర్, రంజని జవదేకర్ దంపతులకు జన్మించిన ప్రకాష్ జవదేకర్ స్థానికంగా అభ్యసించి పూణె విశ్వవిద్యాలయం నుంచి బీకాం పట్టా పొందినారు. కళాశాల అభ్యసన దశలోనే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు వైపు ఆకర్షితుడైనారు. అభ్యసన అనంతరం పదేళ్ళు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పనిచేశారు. తండ్రి కేశవ్ జవదేకర్ హిందూ మహాసభ సీనియర్ నాయకుడే కాకుండా పూణె శాఖ అధ్యక్షుడుగాఉండేవారు. తండ్రి వీర సావర్కార్ కు సన్నిహితుడిగా ఉండేవారు.

రాజకీయ ప్రస్థానం:
1975 నాటి అత్యవసర పరిస్థితి కాలం నాటికి ప్రకాష్ జవదేకర్ ఏబివిపిలో చురుకైన కార్యకర్తగా ఉండేవారు. పూణెలో అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా సత్యాగరహం చేసి అరెస్ట్ అయ్యారు. జైలులో ఉన్నప్పుడు ఆరోగ్యసమస్యలు వచ్చిననూ ఆపరేషన్ కొరకు కూడా బయటకు పంపలేరు. 1990, 1996లలో మహారాష్ట్ర విధానసభకు గ్రాడ్యుయేట్ కోటా నుంచి ఎన్నికయ్యారు. 1995లో మహారాష్ట్ర ప్రణాళిక బోర్డు కార్యనిర్వాహక అధ్యక్షుడైనారు. 8లో మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

రచనలు:
ఆర్థిక విషయాలపై జవదేకర్ పలు గ్రంథాలు రచించారు. గ్రాంఈణాభివృద్ధి మరియు బ్యాంకుల పాత్ర అంశంపై పరిశోధ పత్రానికిగాను పురుషోత్తందాస్ ఠాకూర్ స్మారక అవార్డు పొందినారు.


విభాగాలు: భారతీయ జనతా పార్టీ నాయకులు, మహారాష్ట్ర రాజకీయ నాయకులు, భారతదేశ రాజకీయ నయకులు, 1950లో జన్మించినవారు, పూణె, 


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక