1, ఏప్రిల్ 2014, మంగళవారం

కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం (Kukatpally Assembly Constituency)

కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ సెగ్మెంట్ మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఇది కొత్తగా ఏర్పడింది. హైదరాబాదు శివారులో ఉన్న ఈ నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన సెటిలర్లు అధికంగా ఉన్నారు.  2009 ఎన్నికలలో ఇక్కడినుంచి లోక్‌సత్తా పార్టీ స్థాపకుడు ఎన్.జయప్రకాష్ నారాయణ విజయం సాధించగా 2014 & 2018లో మాధవరం కృష్ణారావు గెలుపొందారు.

నియోజకవర్గ చరిత్ర:
కూకట్‌పల్లి ప్రారంభంలో గ్రామపంచాయతీగా ఉంచి ఆ తర్వాత పురపాలక సంఘంగా ఏర్పడింది. ప్రస్తుతం హైదరాబాదు మహా నగరపాలక సంస్థలో భాగంగా కొనసాగుతోంది. 2009 వరకు హైరతాబాదు నియోజకవర్గంలో ఉన్న ఈ ప్రాంతం నియోజకవర్గాల పునర్విభజనలో ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడింది.

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 జయప్రకాష్ నారాయణ లోక్‌సత్తా పార్టీ నర్సింగరావు కాంగ్రెస్ పార్టీ
2014 కృష్ణారావు తెలుగుదేశం పార్టీ పద్మారావు తెరాస
2018 కృష్ణారావు తెరాస నందమూరి సుహాసిని తెలుగుదేశం పార్టీ


2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నర్సింగరావుపై 15605 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన కృష్ణారావు తన సమీప ప్రత్యర్థి తెరాసకు చెందిన పద్మారావుపై 43176 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున మాధవరం కృష్ణారావు, భాజపా తరఫున మాధవరం కాతారావు, జనకూటమి తరఫున తెలుగుదేశం పార్టీకి చెందిన నందమూరి సుహాసిని పోటీచేశారు. తెరాసకు చెందిన మాధవరం కృష్ణారావు తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన నందమూరి సుహాసిని పై 41049 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: రంగారెడ్డి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం, కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక