16, జూన్ 2013, ఆదివారం

మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం (Malkajgiri Loksabha Constituency)

మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం
జిల్లారంగారెడ్డి, హైదరాబాదు
ప్రస్తుత ఎంపిరేవంత్ రెడ్డి
పార్టీకాంగ్రెస్ పార్టీ


తెలంగాణలోని 17 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో రంగారెడ్డి, హైదరాబాదు జిల్లాలకు చెందిన 7 అసెంబ్లీ నియోజక వర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2008 నియోజకవర్గాల పునవ్యవస్థీకరణలో ఇది కొత్తగా ఏర్పడింది. 2017లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
15వ 2009-14 సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ
16వ 2014-19 మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీ
17వ 2019- రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన టి.భీంసేన్‌పై 93,326 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. సర్వే సత్యనారాయణకు 383368 ఓట్లు రాగా, భీంసేన్‌కు 295042 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి టి.దేవేందర్ గౌడ్3వ స్థానంలో, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎన్.ఇంద్రసేనారెడ్డి 4వ స్థానంలో నిలిచారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి 32 అభ్యర్థులు నామినేషన్ వేయగా ఇద్దరు నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. తుదిబరిలో 30 అభ్యర్థులు మిగిలారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మల్లారెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన మైనంపల్లిపై 28993 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి లోకసభకు ఎన్నికయ్యారు.

2019 ఎన్నికలు:
2019లో జరిగిన ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన మర్రి రాజశేఖర్ రెడ్డిపై 10919 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 603748 ఓట్లు రాగా, తెరాస అభ్యర్థికి 592829 ఓట్లు వచ్చాయి. భాజపాకు చెందిన నారపరాజు రామచందర్ రావు 3,04,282 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.



హోం,
విభాగాలు: రంగారెడ్డి జిల్లా నియోజకవర్గాలు, హైదరాబాదు జిల్లా నియోజకవర్గాలు, మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం,  తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాలు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక