1, ఏప్రిల్ 2014, మంగళవారం

ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం (Uppal Assembly Constituency)

ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ సెగ్మెంట్ మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఇది కొత్తగా ఏర్పడింది.


సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ యాదగిరిరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
2014 ప్రభాకర్ భాజపా సుభాష్ రెడ్డి తెరాస
2018 సుభాష్ రెడ్డి తెరాస తూళ్ళ వీరేందర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ


2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ పురపాలక సంఘం చైర్మెన్ రాజిరెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన యాదగిరిరెడ్డిపై 28183 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 శాసనసభ ఎన్నికలలో ఇక్కడి నుంచి భారతీయ జనతాపార్టీకి చెందిన ప్రభాకర్ తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన సుభాష్ రెడ్డిపై 14169 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున బేతి సుభాష్ రెడ్డి, భాజపా తరఫున ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, జనకూటమి తరఫున తెలుగుదేశం పార్టీకి చెందిన టి.వీరేందర్ గౌడ్ పోటీచేశారు. తెరాసకు చెందినబేతి సుభాష్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన తూళ్ళ వీరేందర్ గౌడ్ పై 48168 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: రంగారెడ్డి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక