1, ఏప్రిల్ 2014, మంగళవారం

ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం (LB Nagar Assembly Conctituency)

ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ సెగ్మెంట్ మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఇది కొత్తగా ఏర్పడింది.


సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 డి.సుధీర్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ కృష్ణప్రసాద్  తెలుగుదేశం పార్టీ
2014 ఆర్.కృష్ణయ్య తెలుగుదేశం పార్టీ రామ్మోహన్ గౌడ్ తెరాస
2018 దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముద్దగౌని రాంమోహన్ గౌడ్ తెరాస


2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి.సుధీర్ కుమార్ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన కృష్ణప్రసాద్ పై 13120 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఎల్బీనగర్ పురపాలక సంఘం మాజీ చైర్మెన్ ఆకుల రమేశ్ గౌడ్ భారతీయ జనతా పార్టీ తరఫున పోటీచేశారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, తెలంగాణ రాష్ట్ర తెదేపా ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన ఆర్.కృష్ణయ్య తన సమీప ప్రత్యర్థి తెరాసకు చెందిన రామ్మోహన్ గౌడ్‌పై 12761 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున ముద్దగోని రామ్మోహన్ గౌడ్, భాజపా తరఫున పేరాల శేఖర్ రావు, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన డి.సుధీర్ రెడ్డి పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన ముద్దగౌని రాంమోహన్ గౌడ్ పై 17848 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: రంగారెడ్డి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం, ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక