1, ఏప్రిల్ 2014, మంగళవారం

మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం (Maheshwaram Assembly Constituency)

మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ సెగ్మెంట్ చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఇది కొత్తగా ఏర్పడింది. పునర్విభజనకు ముందు ఈ ప్రాంతం ఇబ్రహీంపట్నం, మలక్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గాలలో భాగంగా ఉండేది.

ఈ నియోజకవర్గంలోని మండలాలు:
  • మహేశ్వరం,
  • కందుకూర్‌,
  • సరూర్‌నగర్‌ మండలంలోని కొన్ని గ్రామాలు,

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ   తీగల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ
2014 తీగల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ మల్‌రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ


2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, చేవెళ్ళ సిటింగ్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, హైదరాబాదు మేయరుగా పనిచేసిన తీగల కృష్ణారెడ్డిపై 7829 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. గతంలో 2 సార్లు చేవెళ్ళ నుంచి విజయం సాధించిన సబితా ఇంద్రారెడ్డి ఆ స్థానం రిజర్వ్‌డ్ కావడంతో మహేశ్వరం నుంచి పోటీచేశారు. మహాకూటమి పొత్తులో భాగంగా ఈ స్థానం తెరాసకు వెళ్ళిననూ చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ తీగల కృష్ణారెడ్డికి బీ-ఫారం ఇచ్చింది.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డీ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్‌రెడ్డి రంగారెడ్డిపై 40784 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.


విభాగాలు: రంగారెడ్డి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక