భారతీయ జనతాపార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన నరేంద్రమోడి 1950 సెప్టెంబర్ 17న జన్మించారు. 2001 నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడి రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి నడిపిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు. 2014 ఎన్నికలలో భాజపా తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీలో ఉండి భాజపాకు పూర్తి మెజారిటి సాధించిపెట్టారు.2014, మే 26న మోడీ భారతదేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో కూడా మోడి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పూర్తి మెజారిటి సాధించింది.
రాజకీయ ప్రస్థానం: 1987లో నరేంద్ర మోడి భారతీయ జనతా పార్టీలో ప్రవేశించినారు. కొద్దికాలంలోనే రాష్ట్ర భాజపా ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. 1990లో లాల్ కృష్ణ అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు, 1992లో మరళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి-కాశ్మీర్ రథయాత్రకు ఇంచార్జీగా పనిచేశారు.1998లో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో భాజపా విజయం సాధించింది. పార్టీలో సీనియర్ నాయకుడైన కేశూభాయి పటేల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో గుజరాత్‌లో సంభవించిన పెను భూకంపం తర్వాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశూభాయి ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించడంతో భాజపా నాయకత్వం 2001 అక్టోబరులో నరేంద్ర మోడిని గుజరాత్ ముఖ్యమంత్రి పీఠంపై అధిష్టించింది. అప్పటి నుంచి మే 21, 2014న ప్రధానమంత్రి పదవి అధిష్టించడానికి వీలుగా రాజీనామా చేసేవరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీనే కొనసాగారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుండి భాజపాను, ఎన్డీఏని విజయపథంలో నడిపించడమే కాకుండా మోడి స్వయంగా వడోడర మరియు వారణాసిల నుంచి విజయం సాధించారు. 2014, మే 26న మోడీ భారతదేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో కూడా మోడి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పూర్తి మెజారిటి సాధించింది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
4, ఏప్రిల్ 2014, శుక్రవారం
నరేంద్ర మోడి (Narendra Modi)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి