గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆనందిబెన్ జేతాభాయి పటేల్ నవంబరు 21, 1941న గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో జన్మించారు. 30 సంవత్సరాలు అధ్యాపక వృత్తిలో కొనసాగి 1987లో ఒక సంఘటనలో సాహసంతో ఇద్దరు బాలికలను రక్షించి భారతీయ జనతాపార్టీ ఆహ్వానంతో రాజాకీయాలలో ప్రవేశించారు. ఆనందిబెన్ పటేల్ శాసనసభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా, గుజరాత్ మహిళా మోర్చా అధ్యక్షులుగా, రాష్ట్ర మంత్రిగా వ్యవహరించి 2014 మేలో గుజరాత్ ముఖ్యమంత్రి పదవి పొంది ఆ రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు.
రాజకీయ ప్రస్థానం: 1987 నుంచి భాజపాలో ఉన్న ఆనందిబెన్ తన 1994 లో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1998 లో గుజరాత్ రాష్ట్ర ఎన్నికలలో పోటీ చేసి ఆ రాష్ట్ర శాసనసభ్యురాలిగా ఎన్నికైనారు. ఆమె ప్రస్తుతం గుజరాత్ లో వరుసగా నాలుగుసార్లు మహిళా ఎన్నికైన వ్యక్తిగా నిలిచారు. ఆమె నాలుగవ సారి ఎన్నికైన తర్వాత గుజరాత్ రాష్ట్ర కేబినెట్ మంత్రి అయినారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎంపికైనందున ఆయన మే 21, 2014 న తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో గట్లోడియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆనందిబెన్ పటేల్ ను గుజరాత్ ముఖ్యమంత్రిగా శాసనసభా పక్షం ఎన్నుకొంది. ఈమె మే 22న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈమె ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో మహిళా శాసనసభ్యులలో అత్యధిక కాలం శాసనసభ్యురాలిగా ఉన్న మహిళగా గుర్తింపు పొందారు.
= = = = =
|
23, మే 2014, శుక్రవారం
ఆనందిబెన్ పటేల్ (Anandiben Patel)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి