22, మే 2014, గురువారం

వేటూరి సుందరరామమూర్తి (Veturi Sundara Ramamurthy)

వేటూరి సుందరరామమూర్తి
జననంజనవరి 29, 1936
స్వస్థలంపెదకళ్ళేపల్లి
రంగంసినిమా పాటల రచయిత
మరణంమే 22, 2010
ప్రముఖ తెలుగు సునీగీత రచయితగా ప్రసిద్ధి చెందిన వేటూరి సుందరరామ్మూర్తి 1936, జనవరి 29న కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో  జన్మించారు. తిరుపతి వేంకట కవులు, దైతా గోపాలంల వద్ద శిష్యరికం చేసి ప్రారంభంలో పాత్రికేయునిగా పనిచేసి తర్వాత సినీరంగంలో  ప్రవేశించారు. తెలుగు సినిమాలకు సంబంధించి వేల పాటలు రచించారు. 8 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. 75 సంవత్సరాల వయస్సులో మే 22, 2010  మరణించారు.

సినీ ప్రస్థానం:
వేటూరి తొలిసారిగా కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన "ఓ సీత కథ" ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం లాంటి ఎన్నో సినిమాలకు అద్బుతమయిన పాటలు అందించారు. వేటూరి సంప్రదాయ కవిత్వం దగ్గర నుండి జానపద గీతాల వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఆయన మాతృదేవోభవ సినిమాకి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే... అనే పాటకి 1994వ సంవత్సరానికి గాను జాతీయ పురస్కారం లభించింది. అయితే కేంద్ర ప్రభుతం తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చి వేశారు. 

పురస్కారాలు:
వేటూరి 8 సార్లు నంది అవార్డులు, 2 సార్లు జాతీయ పురస్కారాలు పొందారు. తొలిసారిగా 1977లో నందిపురస్కారం పొందిన వేటూరి ఆ తర్వాత శంకరాభరణం, కాంచనగంగ, ప్రతిఘటన, చంటి, సుందర కాండ తదితర చిత్రాలకై అవార్డులు స్వీకరించారు. 1994లో మాతృదేవోభవ చిత్రంలో :రావిపోయే పువ్వా, నీకు రాగాలెందుకే..." పాటకై జాతీయ పురస్కారాన్ని పొందారు. 2000లో ఫిలింఫేర్ అవార్డును స్వీకరించారు.

విభాగాలు: తెలుగు సినిమా, కృష్ణా జిల్లా ప్రముఖులు, మోపిదేవి మండలము, 1936లో జన్మించినవారు, 2010లో మరణించినవారు, 


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక