2, మే 2014, శుక్రవారం

బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం (Bobbili Assembly Constituency)

బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం విజయనగరం జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది విజయనగరం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 133. 1936లో మద్రాసు శాసనసభ ఎన్నికలలో వి.వి.గిరి బొబ్బిలి నుంచి ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత నియోజకవర్గ సంఖ్య 14 గా మారింది. నియోజకవర్గం పరిధిలో 4 మండలాలు కలవు.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
  • బొబ్బిలి, 
  • రామభద్రపురం, 
  • బాడంగి, 
  • తెర్లాం


గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 సుజయ్ కృష్ణ రంగారావు కాంగ్రెస్ పార్టీ టి.లక్ష్మన్నాయుడు తెలుగుదేశం పార్టీ
2014 సుజయ్ కృష్ణ రంగారావు వైకాపా టి.లక్ష్మన్నాయుడు తెలుగుదేశం పార్టీ
2019 వెంకట చిన అప్పలనాయుడు వైకాపా సుజయ్ కృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీ

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కృష్ణరంగారావు తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.లక్ష్మన్నాయుడుపై 24172 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపా తరఫున పోటీచేసిన సుజయ్ కృష్ణ రంగారావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన లక్ష్మన్నాయుడుపై 7330 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినారు.

2019 ఎన్నికలు:
2019 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకు చెందిన సంబంగి వెంకట చిన అప్పలనాయుడు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెంకట సుజయ్ కృష్ణ రంగారావు పై 8352 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: విజయనగరం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, విజయనగరం లోకసభ నియోజకవర్గం, బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక