1, మే 2014, గురువారం

ఖైరతాబాదు అసెంబ్లీ నియోజకవర్గం (Khairatabad Assembly Constituency)

ఖైరతాబాదు అసెంబ్లీ నియోజకవర్గం హైదరాబాదు జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి.ఇది సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. పునర్విభజనకు ముందు ఇది ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గంగా ఉండేది.


గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2004 పి.జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.విజయరామారావు తెలుగుదేశం పార్టీ
2008* పి.విష్ణువర్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.శ్రీనివాస్ రావు లోక్‌సత్తా పార్టీ
2009 దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ కె.విజయరామారావు తెలుగుదేశం పార్టీ
2018 దానం నాగేందర్ తెరాస  చింతల రామచంద్రారెడ్డి భాజపా

2004 ఎన్నికలు:
2004 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ అభ్యర్థి పి.జనార్థన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి కె.విజయరామారావుపై 32419 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పి.జనార్థన్ రెడ్డి 157600 ఓట్లు సాధించగా, విజయరామారావుకు 125181 ఓట్లు లభించాయి.

2008 ఉప ఎన్నికలు:
పి.జనార్థన్ రెడ్డి మరణం వలన జరిగిన ఉప ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి జనార్థన్ రెడ్డి కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి సమీప లోక్‌సత్తా పార్టీకి చెందిన అభ్యర్థి కె.శ్రీనివాస్ రావుపై 1,96,269 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఈ స్థానం నుంచి ముందుగా కుదిరిన అవగాహన మేరకు తెలుగుదేశం పార్టీ పోటీకి దిగలేదు. విష్ణువర్థన్ రెడ్డి 2,54,676 ఓట్లు సాధించగా, శ్రీనివాస్ రావు 58,407 ఓట్లు పొందినారు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన అభ్యర్థి అరీఫుద్దీన్ 54,134 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు.

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కె.విజయరామారావుపై 13845 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 శాసనసభ ఎన్నికలలో తెరాస తరఫున దానం నాగేందర్, భాజపా తరఫున చింతల రామచంద్రారెడ్డి, ప్రజాఫ్రంట్ తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన దాసోజు శ్రవణ్ కుమార్ పోటీచేశారు. తెరాసకు చెందిన దానం నాగేందర్ తన సమీప ప్రత్యర్థి, భాజపాకు చెందిన చింతల రామచంద్రారెడ్డి పై 28402 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: హైదరాబాదు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం, ఖైరతాబాదు అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక