తెలంగాణలోని 17 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజకవర్గంలో హైదరాబాదు జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన జి.కిషన్ రెడ్డి ఎన్నికయ్యారు.
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎంపి అయిన ఎం.అంజన్ కుమార్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన బండారు దత్తాత్రేయపై 170167 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. అంజన్ కుమార్ 340549 ఓట్లు పొందగా, బండారు దత్తాత్రేయ 170382 ఓట్లు సాధించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీనివాస సుధీర్ 3వ స్థానంలో, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి డి.శ్రావణ్ కుమార్ 4వ స్థానంలో, లోకసత్తా అభ్యర్థి నరసింహారావు 5వ స్థానంలో, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి మహమ్మద్ అలీ 6వ స్థానంలో నిలిచారు.
2014 ఎన్నికలు: 2014 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి 38 అభ్యర్థులు నామినేషన్ వేయగా 4 నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. నలుగురు నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. తుదిబరిలో 30 అభ్యర్థులు మిగిలారు.భాజపాకు చెందిన బండారు దత్తాత్రేయ విజయం సాధించి 4వ సారి లోకసభలో ప్రవేశించారు. 2019 ఎన్నికలు: 2019లో జరిగిన ఎన్నికలలో ఇక్కడి నుంచి భాజపా అభ్యర్థి జి.కిషన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెరాసకు చెందిన తలసాని సాయికిరణ్‌పై 62114 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి తొలిసారి లోక్‌సభలో ప్రవేశించారు. భాజపా అభ్యర్థికి 3,84,780 ఓట్లు, తెరాస అభ్యర్థికి 3,22,666 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన అంజన్ కుమార్ యాదవ్ 1,73,229 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. ఇక్కడి నుంచి విజయం సాధించిన కిషన్ రెడ్డి కేంద్రంలో నరేంద్రమోడి మంత్రివర్గంలో స్థానం పొందారు.
= = = = =
|
16, జూన్ 2013, ఆదివారం
సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం (Secunderabad Loksabha Constituency)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి