7, మే 2014, బుధవారం

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం (Tirupathy Assembly Constituency)

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది తిరుపతి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 286. ఎన్టీరామారావు, చిరంజీవిలను గెలిపించిన నియోజకవర్గంగా తిరుపతి ప్రఖ్యాతి చెందింది.

నియోజకవర్గంలోని మండలాలు:
  • తిరుపతి (అర్బన్),


గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1955 రెడ్డివారి నాథముని రెడ్డి కె.ఎల్.పి. కె.కృష్ణారెడ్డి సీ.ఫీ.ఐ.
1962 రెడ్డివారి నాథముని రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగరాల ఈశ్వరరెడ్డి స్వతంత్ర
1967 అగరాల ఈశ్వరరెడ్డి స్వతంత్ర జి.ఆర్.పంద్రవేటి కాంగ్రెస్ పార్టీ
1972 విజయ శిఖామణి కాంగ్రెస్ పార్టీ పి.మునిరెడ్డి ఇండిపెండెంట్
1978 అగరాల ఈశ్వరరెడ్డి ఇందిరా కాంగ్రెస్ పంద్రవేటి గురవారెడ్డి ఇండిపెండెంట్
1983 ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీ అగరాల ఈశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీ
1985 ఎం.రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ పంద్రవేటి గురవారెడ్డి తెలుగుదేశం పార్టీ
1989 ఎం.రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ కోలా రాము తెలుగుదేశం పార్టీ
1994 ఏ.మోహన్ తెలుగుదేశం పార్టీ ఎం.రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ
1999 చదలవాడ కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ ఎం.వెంకటరమణ కాంగ్రెస్ పార్టీ
2004 ఎం.వెంకటరమణ కాంగ్రెస్ పార్టీ ఎన్.వి.ప్రసాద్ తెలుగుదేశం పార్టీ
2009 చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ భూమన కరుణాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2012* భూమన కరుణాకర్ రెడ్డి వైకాపా వెంకటరమణ కాంగ్రెస్ పార్టీ
2014 వెంకటరమణ తెలుగుదేశం పార్టీ భూమన కరుణాకర్ రెడ్డి వైకాపా
2015 సుగుణమ్మ తెలుగుదేశం పార్టీ శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ
2019





2009 ఎన్నికలు:
2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి తన సమీపప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరుణాకర్ రెడ్డిపై 15930 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. మారిన రాజకీయ పరిస్థితులతో ప్రజారాజ్యం పార్టి కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం చిరంజీవి రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ స్థానం ఖాళి అయింది. 2012 జూన్ లో ఉప ఎన్నికలు జరిగాయి.

2012 ఉప ఎన్నికలు:2012 జూన్ లో జరిగిన ఉప ఎన్నికలో వైకాపా తరఫున పోటీచేసిన కరుణాకర్ రెడ్డి  తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటరమణపై 17975 మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 250258 ఓట్లలో 136740 పోల్ కాగా అందులో వైకాపాకు 59195 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 41280 ఓట్లు రాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 30453 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు.


2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన వెంకటరమణ తన సమీప ప్రత్యర్థి, వైకాపాకు చెందిన భూమన కరుణాకర్ రెడ్డీపై 41294 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2014, డిసెంబరు 15న వెంకటరమణ మరణించారు.

2015 ఉప ఎన్నికలు:
2015 ఫిబ్రవరిలో జరిగిన ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన సుగుణమ్మ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీదేవిపై 1,16,524 ఓట్ల భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. 

విభాగాలు: చిత్తూరు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, తిరుపతి లోకసభ నియోజకవర్గం, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక