12, సెప్టెంబర్ 2020, శనివారం

చిరంజీవి (Chiranjivi)

జననం
ఆగస్టు 22, 1955
రంగం
సినీనటుడు, రాజకీయ నాయకుడు
పదవులు
కేంద్రమంత్రి (2012-14)
పురస్కారాలు
పద్మభూషణ్, నంది అవార్డులు, గౌరవ డాక్టరేట్,
ప్రముఖ తెలుగు సినీనటుడిగా, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన చిరంజీవి ఆగస్టు 22, 1955న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్టూరులో జన్మించారు. ఈయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. 150కి పైగా సినిమాలలో నటించిన చిరంజీవి 4 నంది అవార్డులు, ఫిలింఫేర్ లైఫ్ టైమ్‌ అచీవ్‌మెంట్ పురస్కారం, ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్,  భారత ప్రభుత్వం నుంచి 2006లో పద్మభూషణ్ అవార్డు పొందారు. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత దాని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి 2012-14 కాలంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఈయన సోదరులు నాగేంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ కూడా సినీనటులుగా, రాజకీయ నాయకులుగా పేరుపొందారు.

సినీప్రస్థానం:
1978లో తొలిసారిగా పునాదిరాళ్లు సినిమాలో నటించారు. కాని విడుదలైన తొలి సినిమా ప్రాణంఖరీదు. తన సినీజీవితంలో 150 పైగా సినిమాలలో నటించారు. 1988లో స్వయంకృషి సినిమాలో నటనకై ఉత్తమనటుడిగా నంది అవార్డు పొందారు. 1987లో ఈయన నటించిన స్వయంకృషి సినిమా రష్యన్ భాషలోకి డబ్బింగ్ చేసి మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. 1992లో నటించిన ఘరానా మొగుడు బాక్సాఫీజు వద్ద 10 కోట్లు ఆర్జించిన తొలి తెలుగు సినిమాగా నిల్చింది. సినీ జీవితంలో 4 నంది అవార్డులు, రఘుపతి వెంకయ్య అవార్డు, 10 ఫిలింఫేర్ సౌత్ అవార్డులు పొందారు. 2006లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్‌ అచీవ్‌మెంట్ సౌత్ అవార్డు పొందారు.

రాజకీయ ప్రస్థానం:
2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. 2009 ఆంధప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ 18 స్థానాలలో విజయం సాధించింది. 2009లో చిరంజీవి 2 చోట్ల పోటీచేసి తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో విజయంగా, పాలకొల్లు నియోజకవర్గంలో పరాజయం పొందారు. 2011లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి 2012-14 కాలంలో మన్‌మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. 2012-18 కాలంలో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగినారు.

కుటుంబం:
చిరంజీవి ప్రముఖ హాస్యనటుడు అల్లురామలింగయ్య కూతురు సురేఖను 1980లో వివాహం చేసుకున్నారు. సోదరులు నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కూడా సినీనటులుగా, రాజకీయ నాయకులుగా పేరుపొందారు. కుమారుడు రాంచరణ్, కూతుళ్ళు సుష్మిత, శ్రీజ కూడా సినీనటులుగా పేరుపొందారు. 



ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: తెలుగు సినీనటులు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు, కేంద్రమంత్రులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక