9, జూన్ 2014, సోమవారం

బియాస్ నది (Beas River)

బియాస్ నది
 జన్మస్థానంబియాస్ కుండ్
ప్రవహించు రాష్ట్రాలుహిమాచల్ ప్రదేశ్, పంజాబ్,
ప్రధాన నదిసట్లెజ్ నది
పొడవు470 కిలోమీటర్లు
సట్లెజ్ నదికి చెందిన 5 ఉపనదులలో ఒకటైన బియాస్ నది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ కుండ్ వద్ద జన్మిస్తుంది. 470 కిలోమీటర్ల దూరం ప్రవహించి అమృత్‌సర్ కు దక్షిణాన హరికె పటాన్ వద్ద సట్లెజ్ నదిలో సంగమిస్తుంది. ఈ నది నీరు సింధూజలాల ఒప్పందం ప్రకారం భారత్-పాకిస్తాన్ లు వాడుకుంటాయి. ప్రాచీన కాలంలో ఈ నది విపశ నదిగా పిలువబడింది. సట్లెజ్ నదికి చెందిన ఉపనదులలో పూర్తిగా భారతదేశంలోనే ప్రవహించే నది ఇది ఒక్కటే. ఈ నదిపై పోంగ్‌డ్యాం, లార్జీ జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి.

అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క తూర్పు సరిహద్దు ఈ నది కావడం వల్ల చరిత్రలో కూడా ఈ నది ప్రసిద్ధిచెందినది. క్రీ.పూ.326 లో విశ్వవిజేతగా పేరుగాంచిన అలెగ్జాండర్ నంద రాజులకు భయపడి ఈ నది దాటకనే వెనుతిరిగాడు.

జూన్ 8, 2014న హైదరాబాదు లోని ఒక విద్యాసంస్థకు చెందిన 24 విద్యార్థులు బియాస్ నదిపై ఉన్న లార్జీడ్యాం గేట్లు ఒక్కసారి తెరవడంతో నీటి ఉధృతికి కొట్టుకుపోయారు.

విభాగాలు: భారతదేశ నదులు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక