10, జూన్ 2014, మంగళవారం

అలెగ్జాండర్ ది గ్రేట్ (Alexander the Great)

 అలెగ్జాండర్ ది గ్రేట్
జననంక్రీ.పూ.356
జన్మస్థానంపెల్లా
రాజ్యంమాసిడోనియా
మరణంక్రీ.పూ.323
క్రీస్తు పూర్వమే ప్రపంచ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిన అలెగ్జాండర్ ది గ్రేట్ క్రీ.పూ.356లో అప్పటి గ్రీకు దేశంలోని పెల్లాలో జన్మించాడు. తండ్రి ఫిలిప్-2 మాసిడోనియా రాజ్య అధిపతిగా పనిచేశాడు. అలెగ్జాండర్ ప్రముఖ తత్వవేత్త అరిస్టాటిల్ శిష్యునిగా జ్ఞానం సంపాదించాడు. 16వ ఏటనే తండ్రి వారసునిగా రాజ్యాధికారం పొందిన అలెగ్జాండర్ యువ వయస్సులోనే అప్పటికి తెలిసిన ప్రపంచంలోని చాలా భాగాన్ని ఆక్రమించి చరిత్రకారులచే "ది గ్రేట్" అనిపించుకున్నాడు. మూడు పదుల వయస్సులోనే ప్రపంచ విజేతగా నిలిచి తిరుగు ప్రయాణంలో క్రీ.పూ.323లో మార్గమధ్యంలోనే బాబిలోన్ వద్ద మరణించాడు.

ప్రపంచ విజేత:
తండ్రి ఫిలిప్-2 హత్య అనంతరం బలమైన మాసిడోనియా రాజ్య అధిపతిగా పీఠం ఎక్కి, అప్పటికే సుశిక్షులైన సైనికులచే తండ్రి వేసిన ప్రణాళికతో ప్రపంచాన్నే జయించడానికి పూనుకున్నాడు. మొదట అకామినిడ్ రాజ్యాన్ని జయించి ముందుకు వెళ్ళి ఆసియా మైనర్ ప్రాంతాన్ని తన అధీనంలోకి తీసుకువచ్చాడు. పలు యుద్ధాల వల్ల పర్షియా రాజ్యాన్ని ఛిన్నాభినం చేసి మూడవ డేరియన్‌ను అణగద్రొక్కాడు. మరింత ముందుకు వెళ్ళి అడ్రియాటిక్ సముద్రం, సింధూనది వైపు సైన్యాన్ని మళ్ళించాడు. ఆ భూభాగాన్ని కూడా జయించి బియాస్ నది వరకు తన జైత్రయాత్ర కొనసాగించాడు. అప్పటికే తన సైనికులు అలసిపోవడంతో వెనుతిరిగాడు. మార్గమధ్యంలోనే క్రీ.పూ.323లో బాబిలోన్ వద్ద అలెగ్జాండర్ మరణించాడు.

భారత్‌పై దాడి:
క్రీ.పూ 326లో అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేశాడు. సింధూనదిని దాటి తక్షశిల వైపుగా చొరబడ్డాడు. జీలం మరియు చీనాబ్ నదుల మధ్య గల రాజ్యాన్ని పరిపాలిస్తున్న పురుషోత్తముడు (పోరస్) అనే రాజును యుద్ధానికి ఆహ్వానించాడు. అయితే ఆ సమయము లొ అప్పటికే యుద్దం చేసి అలెగ్జాండర్ సైనికులు అలసిపోయారు. నందరాజులకు భయపడి బియాస్ నది దాటడానికి కూడా సాహసించక వెనుతిరిగాడు.

విభాగాలు: ప్రపంచ ప్రసిద్ధులు, గ్రీకు ప్రముఖులు, క్రీస్తు పూర్వ ప్రముఖులు,


 = = = = =


1 కామెంట్‌:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక