27, ఫిబ్రవరి 2015, శుక్రవారం

కేరళ (Kerala)

 కేరళ
రాజధానితిరువనంతపురం
వైశాల్యం38,863 చకిమీ
జనాభా3,33,87,677 (2011)
అధికార భాషమళయాలం
కేరళ భారతదేశంలో దక్షిణాన మలబారు తీరాన ఉన్న రాష్ట్రము. కేరళ సరిహద్దులలో తూర్పు మరియు ఈశాన్య దిక్కులలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు, పడమరన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నాయి. భాషాప్రయుక్త రాష్ట్రాల అవతరణలో భాగంగా మళయాళ భాష మాట్లాడే ప్రాంతంగా 1956లో అవతరించిన కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతతపురం. కోజికోడ్, కొచ్చిన్, కొల్లాం, త్రిసూర్ రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలు. కేరళలో 14 జిల్లాలు, 20 లోకసభ స్థానాలు, 141 అసెంబ్లీ నియోజకవర్గాలు కలవు. రాష్ట్ర విస్తీర్ణం 38,863 చకిమీ కాగా 2011 లెక్కల ప్రకారం జనాభా 3,33,87,677. అక్షరాస్యతలో బాగా ముందంజలో ఉన్న ఈ రాష్ట్రం మానవాభివృద్ధి సూచికలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. కథకళి, మోహినాట్టం కేరళ రాష్ట్ర ప్రధాన నృత్యాలు. ఓనం ఇక్కడి ప్రధాన పండుగ. రాష్ట్రపతిగా పనిచేసిన కె.ఆర్.నారాయణన్, కేంద్రమంత్రులుగా పనిచేసిన జాన్ మత్తాయ్, వి.కె.కృష్ణమీనన్, కరుణాకరన్, ఏ.కె.ఆంటోనీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన బాలకృష్ణన్, ఖగోళశాస్త్రవేత్త ఆర్యభట్ట, హిందూమత తత్వవేత్త ఆదిశంకరాచార్యులు, రచయితలు అరుంధతి రాయ్, శంకర్ కురూప్, సినీనటి భావన, ఆసిన్, ప్రియమణి, నిత్యామీనన్ తదితరులు ఈ రాష్ట్రానికి చెందినవారు.

అలప్పుజ సమీపంలోని హౌజ్ బోట్
భౌగోళికం, సరిహద్దులు:
కేరళ రాష్ట్రం 8°18' నుంచి12°48' ఉత్తర అక్షాంశం, 74°52' నుంచి 77°22' తూర్పు రేఖాంశం మధ్యలో విస్తరించియుంది. రాష్ట్ర వైశాల్యం 38,863 చదరపు కిలోమీటర్లు. ఈ రాష్ట్రానికి పశ్చిమాన విశాలమైన అరేబియా సముద్రతీరం ఉండగా, దక్షిణాన హిందూమహాసముద్రం ఉంది. ఉత్తర, తూర్పు , ఈశాన్యంలలో కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలు కలవు. వైశాల్యంలో ఇది దేశంలో 22వ స్థానంలో ఉంది. రాష్ట్రం గుండా 41 నదులు పశ్చిమం వైపు ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తున్నాయి. వెంబనాద్ సరస్సు రాష్ట్రంలో పెద్దది.

చరిత్ర:
కొచ్చిన్ విమానాశ్రయం
క్రీ.పూ.10 వ శతాబ్దంలో ద్రావిడ భాషలు మాట్లాడే వారు ఇక్కడ స్థిరపడ్డారు. మౌర్య సామ్రాజ్యం లో భాగంగా ఉండేది. తరువాతి కాలంలో చేర సామ్రాజ్యంలోను, భూస్వామ్య నంబూదిరిల పాలనలోను ఉంటూ వచ్చింది. విదేశాలతో ఏర్పరచుకుంటున్న సంబంధాలు చివరకు స్థానికులకు, ఆక్రమణదారులకు మధ్య ఘర్షణలకు దారితీసాయి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి 1956 నవంబర్ 1 న కేరళ పూర్తి స్థాయి రాష్ట్రంగా అవతరించింది.

మోహినాట్టం ప్రదర్శన
రాష్ట్ర నామం:
కేరళకు ఆ పేరెలా వచ్చిందనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. కేర అంటే కొబ్బరి చెట్టు, ఆళం అంటే భూమి - ఈరెంటి నుండి కొబ్బరిచెట్ల భూమిగా కేరళం అయింది అనేది ఒక వాదన. ఈ విధంగా కేరళీయులు తమ భూమిని కేరళం గా పిలుచుకుంటారు. చేర, ఆళం అనగా చేరుల భూమి అనే మాట నుండి కేరళం వచ్చిందనేది మరో అభిప్రాయం కూడా ఉంది.

రవాణా సౌకర్యాలు:
జాతీయ రహదారి సంఖ్య 17 మరియు 47 రాష్ట్రం గుండా వెళ్ళుచున్నాయి. దక్షిణ రైల్వే జోన్‌లో భాగంగా ఉన్న కేరళలో తిరువనంతపురం మరియు పాలక్కాడ్ డివిజన్ కేంద్రాలుగా ఉన్నాయి. తిరువనంతపురం, కొచ్చిన్, కాలికట్‌లలో అంతర్జాతీయ విమానాశ్రయాలు కలవు.
కేరళ జనరల్ నాలెడ్జి,

ఇవి కూడా చూడండి:
 • కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రులు,
 • కేరళ రాష్ట్ర గవర్నర్లు,
 • కేరళ రాష్ట్ర నగరాలు, పట్టణాలు,
 • కేరళ రాష్ట్ర జిల్లాలు,
 • కేరళ రాష్ట్ర ప్రముఖ వ్యక్తులు,


విభాగాలు: భారతదేశ రాష్ట్రాలు, కేరళ,


 = = = = =


Kerala encyclopedia, Kerala State information in telugu,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక