ప్రముఖ సాహితీవేత్త వానమామలై వరదాచార్యులు వరంగల్ పట్టణ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామంలో ఆగస్టు 16, 1912న జన్మించారు. రైతు కుటుంబములో జన్మించిన వరదాచార్యులు ఏడవ తరగతి వరకు మాత్రమే చదివిననూ సంస్కృతాంధ్ర సాహిత్యం, తార్కికం, వేదాంతం, వ్యాకరణాలను అభ్యసించి సంస్కృతం, తెలుగు, ఉర్దూ,హిందీ, ద్రవిడం, మరాఠీ, ఇంగ్లీషు భాషలలో పట్టు సాధించారు. హరికథాగానంలో కూడా ప్రావీణ్యతను సంతరించుకున్నారు. తన 18వ యేట మేనమామ ఏకైక కూతురు వైదేహితో వివాహం జరిగింది. పోతన చరిత్రము రచించి అభినవ పోతనగా గుర్తింపు పొందారు.
ఇతని సహజపాండిత్యాన్ని గుర్తించిన అప్పటి హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా నిజామాబాద్ జిల్లా దోమకొండ జనతా కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకుడిగా నియమించారు. ఆ తర్వాత ఇతను ఆంధ్ర సారస్వత పరిషత్తునుండి విశారద పట్టా పుచ్చుకున్నారు. విశారద పూర్తయ్యాక చెన్నూర్ ఉన్నత పాఠశాలకు బదిలీ అయి 13 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి 1972లో పదవీ విరమణ చేశారు. చెన్నూరులో వేదపాఠశాల నెలకొల్పారు. 1972లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావుచే శాసనమండలికి నామినేట్ అయి 1978 వరకు కొనసాగారు. క్షయవ్యాధికి గురై 1950లలో ఊపిరితిత్తులకు పలుసార్లు శస్త్రచికిత్స చేసి ఒక ఊపిరితిత్తిని తీసివేసిననూ ఒకే ఊపిరితిత్తితోనే కడదాకా జీవించారు. 1984 అక్టోబరు 30న వానమామలై మరణించారు. రచనలు: చిన్న వయస్సులోనే రచనలి ప్రారంభించిన వానమామలై మొత్తం 60కి పైగా పుస్తకాలు రచించారు. వాటిలో ముఖ్యమైనవి పోతన చరిత్రము, వైశాలిని, జయధ్వజము, దాగుడుమూతలు, మాతృప్రేమ, రైతుబిడ్డ ముఖ్యమైనది. పోతన చరిత్రము రచనవల్ల అభినవ పోతనగా గుర్తింపు పొందారు. గుర్తింపులు:
ఇవి కూడా చూడండి:
= = = = =
|
21, నవంబర్ 2014, శుక్రవారం
వానమామలై వరదాచార్యులు (Vanamamalai Varadacharyulu)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
Good poet
రిప్లయితొలగించండిగీత రామాయణం ప్రింట్ ఉన్నదా? కే. జయంత్
రిప్లయితొలగించండిగీత రామాయణం లిరిక్స్ ఉన్నదా? దానిని వరదాచార్యులు గారు వ్రాసారు. పు. సుశీల తదితర గాయని గాయకులు పాడారు. అందులో ఒక పాత రచన ఈ విధముగా ఉంటుంది " దశరథ పాయసం దానం గొనుమా " జన్మమాయె సఖియా రామ జన్మ మాయెను " కే. జయంత్ కుమార్
రిప్లయితొలగించండిgitha ramayanam lyrics ఇంతకుముందు నేను పంపాను " దశరథ పాయసం దానం గొనుమా ? జన్మమాయె సఖియా రామ జన్మ మాయెను ఇవి పు. సుశీల తదితర గాయనీ గాయకులు పాడారు . వాటి కోసం చూస్తున్నాను. కే. జయంత్ కుమార్
రిప్లయితొలగించండి