కాజీపేట వరంగల్ అర్బన్
జిల్లాకు చెందిన మండలము. ఈ మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్‌లో భాగంగా ఉంది. మండల కేంద్రం కాజీపేట వరంగల్ మరియు హన్మకొండలతో కలిసి ఇది ట్రైసిటిగా పిలువబదుతుంది. ప్రజాకవిగా పేరుపొందిన కాళోజీ నారాయణరావు, వానమామలై వరదాచార్య ఈ మండలమునకు చెందినవారు.
2016లో జిల్లాల పునర్విభజన సమయంలో ఈ మండలం కొత్తగా ఏర్పడింది. హన్మకొండ మండలంలోని 9 గ్రామాలు, ధర్మసాగర్ మండలంలోని ఒక గ్రామంలో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన హన్మకొండ మండలం మరియు హసన్‌పర్తి మండలం, తూర్పున ఖిలా వరంగల్ మండలం, దక్షిణాన ఐనవోలు మండలం, పశ్చిమాన ధర్మసాగర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.
రాజకీయాలు:
ఈ మండలము వర్థన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. రవాణా సౌకర్యాలు: తెలంగాణలోనే ప్రఖ్యాతిచెందిన కాజీపేట జంక్షన్ మండల కేంద్రంలో ఉంది. ఢిల్లీ, సికింద్రాబాదు, విజయవాడలకు ఇక్కడి నుంచి రైలుమార్గం ఉంది. హైదరాబాదు నుంచి ఛత్తీస్‌గఢ్ వెళ్ళు జాతీయ రహదారి నెంబర్ 202 మండలం మీదుగా వెళ్ళుచున్నది.
కాజీపేట మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్
చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
కాజీపేట (Khazipet), సోమిది (Somidi), మడికొండ (Madikonda), తారలపల్లి (Tharalapalli), కడిపికొండ (Kadipikonda), కొత్తపల్లి (Kothapalli), బట్టుపల్లి (Battupalli), అమ్మవారిపేట (Ammavaripet), శ్యాయంపేట (Shaympet), రాంపూర్ (Rampur)
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
కాజీపేట (Khajipet): కాజీపేట వరంగల్ పట్టణ జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. ఇది పూర్తిగా పట్టణ ప్రాంతము. గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్‌లో భాగంగా ఉంది. వరంగల్ మరియు హన్మకొండలతో కలిపి ఇది ట్రైసిటీస్‌గా పిల్వబడుతుంది. కాజీపేట రైల్వేజంక్షన్ తెలంగాణలోని ప్రముఖ రైల్వే జంక్షన్‌లలో ఒకటి. మడికొండ (Madikonda): మడికొండ వరంగల్ పట్టణ జిల్లా కాజీపేట మండలమునకు చెందిన గ్రామము. ప్రజాకవిగా పేరుపొందిన కాళోజీ నారాయణరావు, సాహితీవేత్త వానమామలై వరదాచార్య ఈ గ్రామమునకు చెందినవారు. గ్రామంలో ప్రఖ్యాతిచెందిన శ్రీమెట్టురామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Khajipet or Khazhipet Mandal in Telugu, Warangal Urban Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి