18, డిసెంబర్ 2014, గురువారం

తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao)

తుమ్మల నాగేశ్వరరావు
జననంనవంబరు 5, 1953
స్వస్థలంగొల్లగూడెం
రంగంరాజకీయాలు
పదవులు4 సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి,
ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన తుమ్మల నాగేశ్వరరావు నవంబరు 5, 1953న గొల్లగూడెం గ్రామంలో జన్మించారు. బీకాం వరకు అభ్యసించి రాజకీయాలలో ప్రవేశించిన నాగేశ్వరరావు 4 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేయగా, డిసెంబరు 2014లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. 2018లో పాలేరు నుంచి పోటీచేసి ఓడిపోయారు.

రాజకీయ ప్రస్థానం:
1982లోనే తెలుగుదేశం పార్టీలో ప్రవేశించిన తుమ్మల 1983లో తొలిసారి శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు. 1985లో గెలుపొందారు. అప్పుడే ఎన్టీయార్ మంత్రివర్గంలో స్థానం పొందారు. 1994, 1999లలో సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, 2009లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెదేపా తరఫున విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కూడా పనిచేశారు. 2014లో తెదేపా అభ్యర్థిగా ఓడిపోయి ఆ తర్వాత తెరాసలో చేరారు. 2014 డిసెంబరు 16న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. 2015, జూన్ 1న ఎమ్మెల్సీగా ఎన్నికైనారు. 2016 మేలో పాలేరు శాసనసభ ఉప ఎన్నికలలో భారీ మెజారిటితో విజయం సాధించారు. 2018లో పాలేరు నుంచి పోటీచేసి ఓడిపోయారు.
 
 


హోం,
విభాగాలు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రముఖులు, 13వ శాసనసభ సభ్యులు


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక