17, డిసెంబర్ 2014, బుధవారం

కాశీనాథరావు వైద్య (Kashinath Rao Vaidya)

కాశీనాథరావు వైద్య
రంగంవిమోచనోద్యమం, రాజకీయాలు,
పదవులుహైదరాబాదు శాసనసభ స్పీకరు,
మరణంమార్చి 13, 1959
హైదరాబాదు రాష్ట్ర శాసనసభ స్పీకరుగా పనిచేసిన కాశీనాథరావు వైద్య హైదరాబాదులో జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఈయన హైదరాబాదు విమోచనోద్యమంలో చురుకుగా పాల్గొని ఆ తర్వాత రాజకీయాలలో కూడా పాలుపంచుకున్నారు. 1936లో హైదరాబాదులో జరిగిన విద్యా మహాసభకు అధ్యక్షత వహించారు. అరవముదు అయ్యంగార్ అధ్యక్షతన ఏర్పడిన రాజకీయ సంస్కరణల కమీటీలో కాశీనాథరావు సభ్యులుగా ఉన్నారు. రయ్యత్ దినపత్రిక డైరెక్టర్ బోర్డు సభ్యులుగా కూడా పనిచేశారు. నిజాం కాలంలో ఈయన బూర్గుల రామకృష్ణారావు, వినాయకరావు విద్యాలంకార్, కొండా వెంకట రంగారెడ్డిలతో పాటు మితవాదుల పక్షం వహించారు.

1952లో జరిగిన హైదరాబాదు రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్ధిగా బేగంబజారు నియోజకవర్గం నుండి విజయం సాధించి హైదరాబాదు శాసనసభ స్పీకరుగా ఎన్నికయ్యారు. 1959 మార్చి 13న కాశీనాథరావు హైదరాబాదులో మరణించారు.

విభాగాలు: హైదరాబాదు ప్రముఖులు, హైదరాబాదు విమోచనోద్యమం, 1959లో మరణించినవారు,


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
 • తెలుగు వికీపీడియా,
 • ఆంగ్ల వికీపీడియా,
 • 50 సంవత్సరాల హైదరాబాదు (రచన: మందుముల నరసింహరావు)

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక