15, డిసెంబర్ 2013, ఆదివారం

పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం (Paleru Assembly Constituency)

పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం ఖమ్మం జిల్లాకు చెందిన 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. 2009 నాటి నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గంలో 4మండలాలున్నాయి. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 4 మండలాలు కలవు.
 • తిరుమలాయపాలెం
 • కూసుమంచి
 • ఖమ్మం (గ్రామీణ)
 • నేలకొండపల్లి

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 రామిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ తమ్మినేని వీరభద్రం సీపీఎం పార్టీ
2014 రామిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ స్వర్ణకుమారి తెలుగుదేశం పార్టీ
2006* తుమ్మల నాగేశ్వరరావు తెరాస సుచరితారెడ్డి కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సుజాతానగర్ సిటింగ్ ఎమ్మల్యే రామిరెడ్డి వెంకటరెడ్డి తన సమీప ప్రత్యర్థి, సీపీఎం పార్టీ అభ్యర్థి తమ్మినేని వీరభద్రంపై 5666 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున రాయ నాగేశ్వరరావు పోటీచేశారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన సిటింగ్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి అయిన స్వర్ణకుమారిపై 21600 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. మార్చి 6, 2016న రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించారు.

2016 ఉప ఎన్నికలు:
2014లో విజయం సాధించిన రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించడంతో 2016 మేలో ఉప ఎన్నికల జరిగింది. ఈ ఉప ఎన్నికలో రాష్ట్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన తుమ్మల నాగేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన సుచరితారెడ్డిపై 45682 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి భార్య సుచరితారెడ్డికి ఈ ఎన్నికలలో వామపక్షాలు కూడా మద్దతు ప్రకటించిననూ, సానుభూతి ఉన్ననూ 49వేల ఓట్లు మాత్రమే రాగా, విజయం సాధించిన తుమ్మలకు సుమారు 95 వేల ఓట్లు లభించాయి.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున తుమ్మల నాగేశ్వరరావు, భాజపా తరఫున కొండపల్లి శ్రీధర్ రెడ్డి, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన కందాల ఉపేందర్ రెడ్డి పోటీచేస్తున్నారు.


విభాగాలు: ఖమ్మం జిల్లా నియోజకవర్గాలు, ఖమ్మం లోకసభ నియోజకవర్గం, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక