14, జనవరి 2015, బుధవారం

భగవాన్ దాస్ (Bhagwan Das)

భగవాన్ దాస్
జననంజనవరి 12, 1869
జన్మస్థానంవారణాసి
రంగంస్వాతంత్ర్యోద్యమం, తత్వవేత్త,
గుర్తింపులుభారతరత్న (1955)
మరణంసెప్టెంబర్ 18, 1958
తత్వవేత్తగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా పేరుపొందిన భగవాన్ దాస్ జనవరి 12, 1869న కాశీ (వారణాసి)లో జన్మించారు. కొంతకాలము అవిభాజిత భారతదేశము యొక్క కేంద్ర విధానసభ లో పనిచేశాడు. స్వాతంత్ర్య సమరయోధునిగా బ్రిటిషు పాలనకు వ్యతిరేకముగా పోరాడారు. అనిబీసెంట్‌తో కలిసి ఈయన స్థాపించిన కేంద్ర హిందూ కళాశాల తర్వాత కాలములో బనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా మారింది. జాతీయ విశ్వవిద్యాలయమైన కాశీ విద్యాపీఠమును స్థాపించి ప్రాధానోపాధ్యాయునిగా పనిచేశారు.

భారతీయ జాతీయ కాంగ్రెస్‌లో చురుకుగా పాల్గొన్న ఈయన 1919లో జరిగిన మొరదాబాద్ కాంగ్రెస్ సమావేశానికి గౌరవాధ్యక్షులుగా వ్యవహరించారు. వారణాసి నగర మేయరుగా కూడా పనిచేసిన భగవాన్ దాస్ భారతీయ దివ్యజ్ఞానం పత్రికకు చాలా కాలం పాటు సంపాదకుడిగా వ్యవహరించారు. సంస్కృత పండితుడైన భగవాన్ దాస్ సంస్కృతం, హిందీ బాషలలో దాదాపు 30 పుస్తకాలు రచించారు. ఈయన సేవలకుగాను భారతప్రభుత్వం 1955లో భారత రత్న పురస్కారము ప్రధానము చేసింది. సెప్టెంబర్ 18, 1958న భగవాన్ దాస్ మరణించారు. మహారాష్ట్ర గవర్నరుగా పనిచేసిన శ్రీప్రకాష ఈయన కుమారుడు.

విభాగాలు: ఉత్తరప్రదేశ్ ప్రముఖులు, వారణాసి, భారతరత్న పురస్కార గ్రహీతలు, 1869లో జన్మించినవారు, 1958లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక