14, జనవరి 2015, బుధవారం

సి.వి.రామన్ (C.V.Raman)

 సి.వి.రామన్
జననంనవంబరు 7, 1888
రంగంభౌతికశాస్త్రవేత్త
గుర్తింపులునోబెల్ బహుమతి (1930), భారతరత్న (1954),
మరణంనవంబరు 21, 1970
ప్రముఖ భౌతికశాస్త్రవేత్తగా పేరుపొందిన చంద్రశేఖర వెంకటరామన్ నవంబరు 7, 1888న ఇప్పటి తమిళనాడులోని తిరుచినాపల్లి ప్రాంతంలో జన్మించారు. 1907లో ఎం.ఎస్సీ.(ఫిజిక్స్)లో విశ్వవిద్యాలయ ప్రథముడిగా నిలిచారు. 18 వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై ఈయన రచించిన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమైంది. ఐసిఎస్ పాసైన రామన్ కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరారు. విజ్ఞాన పరిశోధన తృష్ణ వలన తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరారు. 1928లో రామన్ ఎఫెక్టును కనుగొన్నందుకు 1930లో భౌతికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించింది. 1954లో భారత ప్రభుత్వం ఆయనను భారతరత్న పురస్కారంతో సత్కరించింది. ఆయన పరిశోధన ఫలితాన్ని ధృవపరిచిన ఫిబ్రవరి 28 రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. రామన్ నవంబరు 21, 1970న బెంగుళూరులో మరణించారు.

రామన్ ఎఫెక్ట్:
సముద్రపు నీటిపై సూర్యకాంతి పడినప్పుడు ఆ కాంతిలోని నీలం రంగు ఎక్కువగా పరిక్షేపం (scattering) చెంది మన కంటికి చేరడం వల్లనే సముద్రం నీలంగా కనిపిస్తుందని సి.వి.రామన్ సిద్ధాంతీకరించాడు. ఇలా ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో తెలిపే పరిశోధన ఫలితాన్నే రామన్ ఎఫెక్ట్ అంటారు.
సి.వి.రామన్ జనరల్ నాలెడ్జి
కాంతి కిరణాలు ఒక ద్రవ పదార్థంపై పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపం చెందుతుంది. అంటే కాంతి కిరణాల్లోని ఫోటాన్ కణాలు, ద్రవ పదార్థాల పరమాణువులపై పడి పరిక్షేపం చెందుతాయి. చాలా ఫోటాన్లు పడేటప్పటి పౌనఃపున్యంలోనే చెదిరిపోతే, కొన్ని ఫోటాన్లు మాత్రం అంతకు తక్కువ పౌనఃపున్యంతో పరిక్షేపం చెందుతాయి. అంటే పడిన కాంతిలో కొంత భాగం మాత్రం వేరే పౌనఃపున్యంతో చెదురుతుంది. ఇదే రామన్ ఎఫెక్ట్. దీన్ని కనుగొన్నందుకు ఆయన 1930లో నోబెల్ బహుమతిని అందుకున్నారు.

హోం
విభాగాలు: తమిళనాడు ప్రముఖులు, భారతరత్న పురస్కార గ్రహీతలు, నోబెల్ బహుమతి పొందిన భారతీయులు, ప్రముఖ శాస్త్రవేత్తలు, భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు, 1888లో జన్మించినవారు, 1970లో మరణించినవారు,


 = = = = =Tags: C.V.Raman in Telugu, Telugulo c.v.raman, తెలుగులో సి.వి.రామన్, c.v.raman quiz in telugu, scientists biography in telugu, telugulo shastravettalu, science samacharam in telugu, about C.V.Raman, Biography of C.V.Raman
 

శాస్త్రవేత్తలకు సంబంధించి ఎంపికచేసిన ప్రశ్నలు, వివిధ పోటీపరీక్షలలో వచ్చిన ప్రశ్నలు, వందకుపైగా శాస్త్రవేత్తలకు సంబంధించి పాయింట్లవారీ పట్టికలు కలిగిన CCKRao సీరీస్ "ప్రపంచప్రసిద్ధి శాస్త్రవేత్తలు క్విజ్" పుస్తకం రూ.40/-, పేజీలు 96. మరిన్ని వివరాలకు ఇక్కడ నొక్కండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక