నాసిక్ జిల్లా మహారాష్ట్రకు చెందిన 36 జిల్లాలలో ఒకటి. 15,530 చకిమీ వైశాల్యం కలిగిన ఈ జిల్లా జనాభా 2011 లెక్కల ప్రకారం 61,09,052. జిల్లా పశ్చిమప్రాంతం పశ్చిమ కనుమలతో కూడిన పర్వతాలతో వ్యాపించియుంది. డామన్ గంగా నదితో పాటు పలు నదులు ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలియుచుండగా దక్షిణ భారతదేశ్ంలో అతిపొడవైన నది గోదావరి నది ఈ జిల్లాలోనే జన్మించి నాలుగు రాష్ట్రాల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. సిల్క్ ఉత్పత్తులకు పేరుగాంచిన ఎయోలా ఈ జిల్లాలోనిదే. మన్మాడ్‌లో రైల్వే వర్క్‌షాప్ ఉంది. మహారాష్ట్ర అధికార భాష అయిన మరాఠి ఇక్కడ వ్యాప్తిలో ఉంది. జిల్లాలో 15 తాలుకాలు కలవు. నాసిక్‌లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ నిర్వహిస్తారు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ జిల్లాకు ఉత్తరాన ధూలె జిల్లా, తూర్పున జలగాన్ జిల్లా, ఆగ్నేయాన ఔరంగాబాదు జిల్లా, దక్షిణాన అహ్మదాబాదు జిలా, నైరుతిన థానె జిల్లా, పశ్చిమాన గుజరాత్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నయి. జిల్లా ఉత్తర-దక్షిణంగా పశ్చిమ కనుమలు (సహ్యాద్రి పర్వతాలు) వ్యాపించియున్నాయి. జనాభా: 1901లో జిల్లా జనాభా 8,16,504. 2011 నాటికి జిల్లా జనాభా 61,09,052కు పెరిగింది. 2001-11 కాలంలో జనాభా వృద్ధి 22.33%. స్త్రీ-పురుష్ నిష్పత్తి 931. అక్షరాస్యత శాతం 80.96%.
18వ శతాబ్దిలో ప్రస్తుత నాసిక్ జిల్లా ప్రాంతం మరాఠా పీష్వా పాలనలో భాగంగా ఉండేది. జిల్లాలో పలు ప్రాచీన కోటలు మరియు ఆంగ్ల-మరాఠా యుద్ధ శిథిలాలు కనిపిస్తాయి. 1818లో ఈ ప్రాంతం పీష్వాల నుంచి బ్రిటీష్ పాలనలోకి వెళ్ళింది. అప్పుడు బొంబాయి ప్రెసిడెన్సిలో భాగంగా కొంతభాగం అహ్మదాబాదు జిల్లాలో మరికొంతభాగం కాందేష్ జిల్లాలో ఉండేది. 1869లో ప్రత్యేకంగా నాసిక్ జిల్లా ఏర్పాటుచేయబడింది. స్వాతంత్ర్యానంతరం 1847 నుంచి 1960 వరకు ఈ జిల్లా బొంబాయి రాష్ట్రంలో ఉండగా 1960లో బొంబాయి రాష్ట్ర విభజన జరిగి మహారాష్టృఅ, గుజరాత్ రాష్ట్రాలు అవతరించగా ఈ జిల్లా మహారాష్ట్రలో భాగమై కొనసాగుతోంది.
= = = = =
|
27, ఏప్రిల్ 2015, సోమవారం
నాసిక్ జిల్లా (Nashik district)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి