దేశంలో జరిగే 12 నదుల పుష్కరాలలో గోదావరి నది పుష్కరము ఒకటి. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరాలు నిర్వహిస్తారు. ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. గతంలో 1979, 1991, 2003లలో పుష్కరాలు జరుగగా ప్రస్తుతం 2015లో జరుగుతున్నాయి. గోదావరి నది ప్రవహించే రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో నది ఒడ్డున ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ప్రత్యేక ఘాట్‌లు ఏర్పాటుచేసి వైభవంగా పుష్కరాలు నిర్వహిస్తున్నారు.
2015 పుష్కరాలు: 2015లో జులై 14 నుంచి 25వ తేదీ వరకు ఈ పుష్కరాలు నిర్వహిస్తారు. జూలై 14వ తేదీన ఉదయం 6:26 గంటలకు ప్రత్యేక పూజలు, గోదావరి హారతితో పుష్కరాలను ప్రారంభించారు. 12 రోజులపాటు జరిగే పుష్కరాలలో నదీ ప్రవాహ రాష్ట్రాలు తీరం వెంబడి పలు ఘాట్లు ఏర్పాటు చేస్తున్నాయి. తెలంగాణలో 2015 గోదావరి పుష్కరాలు: తెలంగాణ ఆవిర్భావం తర్వాత వచ్చిన తొలి పుష్కరం కాబట్టి దీన్ని కుంభమేళ తరహాలో వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పోచంపాడ్, సావెల్, గుమ్మిర్యాల్, దోంచంద్ పుష్కరఘాట్ల పనులకు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఏప్రిల్ 23న ప్రారంభోత్సవం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 27 పుష్కరఘాట్ల ఉండగా ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో 106 పుష్కరఘాట్లను ఏర్పాటుచేశారు. పుష్కర పనులకు రూ 500 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. కందకుర్తిలో మొదలై నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తున్నారు. లోగడ 3 కోట్ల మంది భక్తులు పుష్కరాల స్నానాలు చేయగా, 2015 పుష్కరాలలో 8 కోట్ల మంది పుష్కర స్నానాలు చేస్తారని అంచన వేశారు.
2015 పుష్కరాలకు 4 నుంచి 5 కోట్ల మంది భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. గోదావరి తీరం వెంబడి గుర్తించిన 327 దేవాలయాలను పునరుద్ధరించి, భక్తులకు సౌకర్యాలు కల్పించనున్నారు. ఇందుకోసం రూ.900 కోట్లు బడ్జెట్ అవసరం అవుతుంది, కేంద్రం నుంచి 600 కోట్ల నిధులకు ప్రతిపాదనలు పంపారు. రాష్ట్ర బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు. పుష్కరాలకు విచ్చేసే వీఐపీలను దృష్టిలో పెట్టుకుని రాజమండ్రి, కొవ్వూరులో రెండు ఘాట్‌లను ఏర్పాటు చేశారు. మే 17న చంద్రబాభునాయుడు గోదావరి పుష్కర లోగోను విడుదల చేశారు. జూలై 14, 2015న పుష్కరాల తొలిదినమే రాజమండ్రివద్ద తొక్కిసలాట జరిగి 23మంది మరణించారు. తెలంగాణలో గోదావరి పుష్కర ఘాట్లు: నిజామాబాదు జిల్లా
= = = = =
|
Godavari Pushkaram in Telugu, Godavari pushkaralu information in telugu, godavari pushkara ghats details in telugu, godavari pushkara ghats in telangana,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి