వడోదర గుజరాత్ రాష్ట్రానికి చెందిన 33 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా 7,794 చకిమీ వైశాల్యం మరియు 41,65,626 జనాభా (2011 ప్రకారం) కలిగియుంది. 8వ నెంబరు జాతీయ రహదారి , మాహీనది జిల్లా గుండా వెళ్ళుచున్నాయి. బరోడా సంస్థానానికి రాజధానిగా ఉన్న వడోదర ఈ జిలా పరిపాలన కేంద్రం మరియు ప్రముఖ వాణిజ్య, విద్యా కేంద్రంగా ఉంది. శయాజీరావ్ విశ్వవిద్యాలయం బరోడాలో ఉంది. వడోదర, ధబోయ్, పద్రా, సావ్లి, వఘోడియా జిల్లాలోని ప్రధాన పట్టణాలు. జిల్లాలో 8 తాలుకాలు కలవు. రచయిత ప్రేమానంద్ భట్, క్రికెటర్ నయన్ మోగియా, పఠాన్ సోదరులు ఈ జిల్లాకు చెందినవారు.
సరిహద్దులు: ఈ జిల్లాకు ఉత్తరాన పంచ్‌మహల్ మరియు దాహోద్ జిల్లాలు, పశ్చిమాన ఆనంద్ ఖెడా జిల్లా, వాయువ్యాన ఖెడా జిల్లా, దక్షిణాన బారుచ్ మరియు నర్మద జిల్లాలు, తూర్పున మధ్యప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లా గుండా మాహీనది ప్రవహిస్తుంది. జిల్లా కేంద్రం బరోడా (వడోదర) విశ్వామిత్రి నది ఒడ్డున ఉంది. చరిత్ర: సుమారు 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన జిల్లా ప్రాంతం 1739 నుంచి స్వాతంత్ర్యం వరకు గైక్వాడ్‌ల అధీనంలోని బరోడా రాజ్యంలో భాగంగా ఉండేది. శయాజీరావ్ గైక్వాడ్ కాలంలో ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. స్వాతంత్ర్యానంతరం బొంబాయి రాష్ట్రంలో భాగంగా మారి 1960లో గుజరాత్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడంతో ఆ రాష్ట్రంలో భాగంగా మారింది.
2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 41,65,626. గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాదు మరియు సూరత్‌ల తర్వాత ఇది మూడవ అత్యధిక జనాభా కలిగిన జిల్లా. జనసాంద్రత 551. 2001-11 కాలంలో జనాభా పెరుగుదల రేటు 14.16%. స్త్రీ-పురుష్ నిష్పత్తి 934/1000. అక్షరాస్యత శాతం 81.21%. రవాణా సౌకర్యాలు: 8వ నెంబరు జాతీయ రహదారి జిల్లా గుండా వెళ్ళుచుండగా పలు ముఖ్య రహదారులు జిల్లా లోని ప్రధాన పట్టణాలను కలుపుతున్నాయి. జిల్లా కేంద్రం బరోడా ప్రముఖ రైల్వే జంక్షన్ మరియు డివిజన్ కేంద్రం. ఇవ్ కూడా చూడండి:
= = = = =
|
11, మే 2015, సోమవారం
వడోదర జిల్లా (Vadodara DIstrict)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి