4, జులై 2015, శనివారం

పి.శివశంకర్ (P.Shiv Shankar)

పి.శివశంకర్
జననంఆగస్టు 10, 1929
రంగంన్యాయవాది, రాజకీయాలు
నిర్వహించిన పదవులుకేంద్రమంత్రి, సిక్కిం మరియు కేరళ గవర్నరు,
మరణంఫిబ్రవరి 27, 2017
కేంద్రమంత్రిగా, కేరళ మరియు సిక్కిం రాష్ట్రాల గవర్నరుగా పనిచేసిన పి.శివశంకర్ ఆగస్టు 10, 1929న హైదరాబాదులో జన్మించారు. అమృత్‌సర్ నుంచి బి.ఏ.పట్టాను, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టాను పొంది 1974-75 కాలంలో హైకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాలలో ప్రవేశించి లోకసభకు, రాజ్యసభకు ఎన్నికకావడమే కాకుండా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మంత్రివర్గాలలో స్థానం పొందారు. కేరళ మరియు సిక్కిం రాష్ట్రాల గవర్నరుగా కూడా పనిచేశారు. ఫిబ్రవరి 27, 2017న మరణించారు

రాజకీయ ప్రస్థానం:
న్యాయవాదవృత్తి నుంచి రాజకీయాలలో ప్రవేశించిన శివశంకర్ తొలిసారిగా 1978లో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1980లో కూడా మరోసారి అదే నియోజకవర్గం నుంచి ఎన్నికై ఇందిరాగాంధీ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా స్థానం పొందారు. 1985లో రాజ్యసభకు ఎన్నికై రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో కూడా స్థానం పొందారు. ఈ కాలంలో ప్రణాళిక సంఘం డిప్యూటి చైర్మెన్‌గా, 1989-91 కాలంలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 1994లో సిక్కిం గవర్నరుగా, 1995లో కేరళ గవర్నరుగా నియమించబడ్డారు. 1998లో తెనాలి లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకవచ్చి 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్ననూ వయోభారం వల్ల క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.


విభాగాలు: కేంద్రమంత్రులు, సిక్కిం గవర్నలు, కేరళ గవర్నర్లు, 6వ లోకసభ సభ్యులు, 7వ లోకసభ సభ్యులు, సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం, 1929లో జన్మించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక