24, ఆగస్టు 2015, సోమవారం

ప్రో కబడ్డీ లీగ్ 2015 (Pro Kabaddi League 2015)

 ప్రో కబడ్డీ లీగ్ 2015
విజేతయు ముంబా
రన్నరప్బెంగుళూరు బుల్స్‌
టోర్నీ కాలంజూలై 18, 2015 నుంచి ఆగస్టు 23, 2015
జట్ల సంఖ్య8
2014లో ప్రారంభమైన కబడ్డీ లీగ్ రెండో అంచె పోటీలు జూలై 18, 2015 నుంచి ఆగస్టు 23, 2015 వరకు నిర్వహించబడింది. 8 జట్ల మధ్య మొత్తం 60 మ్యాచ్‌లు జరిగాయి. లీగ్ మ్యాచ్‌లలో అగ్రస్థానం పొందిన 4 జట్లు సెమీస్ చేరగా తొలి సెమీస్‌లో బెంగుళూరు బుల్స్, రెండో సెమీస్‌లో యు ముంబా జట్లు విజయం సాధించి ఫైనల్స్ చేరాయి. ఆగస్టు 23, 2015న జరిగిన ఫైనల్లో యు ముంబా జట్టు బెంగుళూరు బుల్స్‌పై 36-30 పాయింట్ల తేడాతో గెలుపొంది టైటిల్ సాధించింది.

లీగ్ దశ:
మొత్తం 8 జట్ల మధ్యన డబుల్ రౌండ్ రాబిన్ పద్దతిలో లీగ్ మ్యాచ్‌లు జరిగాయి. ఒకో జట్టు మిగితా ఏడు జట్లతో రెండేసి సార్లు ఆడగా మొత్తం 14 మ్యాచ్‌లలో యు ముంబా 60 పాయింట్లతో లీగ్ దశలో అగ్రస్థానం పొందింది. తెలుగు టైటాన్స్ 50 పాయింట్లతో రెండో స్థానంలో, బెంగుళూరు బుల్స్ 48 పాయింట్లతో మూడో స్థానంలో, పాట్నా పైరేట్స్ 41 పాయింట్లతో నాల్గో స్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించాయి. గత ఏడాది ఛాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్‌తో పాటు బెంగాల్ వారియర్స్, దబాంగ్ డెల్హీ, పినేరి పల్టాన్ జట్లు లీగ్ దశలోనే ఆగిపోయాయి.
ప్రో కబడ్డీ లీగ్ 2015 జనరల్ నాలెడ్జి

సెమీఫైనల్స్:
లీగ్ దశలో 2, 3 స్థానాలు పొందిన తెలుగు టైటాన్స్ మరియు బెంగుళూరు బుల్స్ జట్ల మధ్యన తొలి సెమీఫైన మ్యాచ్ ఆగస్టు 21న జరిగింది, ఈ మ్యాచ్‌లో బెంగుళూరు బుల్స్ 39-38 స్వల్ప తేడాతో తెలుగుటైటాన్స్ పై విజయం సాధించి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. లీగ్ దశలో 1, 4 స్థానాలు పొందిన యు ముంబా మరియు పాట్నా పైరేట్స్‌ల మధ్యన అదే రోజు జరిగిన రెండో సెమీఫైనల్లో యు ముంబా జట్టు 35-18 తేడాతో విజయం సాధించింది.

ఫైనల్ మ్యాచ్:
ఆగస్టు 23న ముంబాయిలోని సర్దార్ వల్లభ్ భాయి పటేల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోటీలో యు ముంబా జట్టు 36-30 తేడాతో బెంగుళూరు బుల్స్‌పై విజయం సాధించి తొలిసారి టైటిల్ సాధించింది. అంతకు క్రితం 3వ స్థానం కోసం జరిగిన పోటీలో తెలుగు టైటాన్స్ జట్టు పాట్నా పైరేట్స్‌పై 34-26 తేడాతో గెలుపొందింది.

విభాగాలు: కబడ్డీ, 2015 టోర్నమెంట్లు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక