బూర్గుల శ్రీనాథశర్మ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత. డిసెంబరు 12, 1961న జన్మించిన శ్రీనాథశర్మ బీఎస్సీ, బీఎడ్, ఎంఏ వరకు అభ్యసించి 1985లో ఉపాధ్యాయవృత్తిలో ప్రవేశించి, ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే రచయితగా, కవిగా, వ్యాసకర్త, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారు. పాలమూరు జిల్లాలోని ప్రముఖ సాహితీవేత్తగా గుర్తింపు పొందిన శ్రీనాథశర్మ పలు అవార్డులు, గుర్తింపులు పొందారు.
రచయితగా: చిన్నవయస్సు నుంచే సాహిత్యంపై మక్కువ కలిగిన శ్రీనాథశర్మ కవిగా, రచయిత, వ్యాసకర్తగా మన్ననలందుకుంటున్నారు. ఇప్పటివరకు ప్రముఖ తెలుగు దిన, వార, మాసపత్రికలలో 3000కు పైగా వ్యాసాలు, 300కు పైగా కథలు, ఆకాశవాణిలో 100కు పైగా రచనలు, 100కు పైగా జానపద వ్యాసాలు ప్రకాశింపజేశారు. 1 నుంచి 5వ తరగతికి సంబంధించిన తెలుగు, సైన్స్ పాఠ్యపుస్తకాలు, 10వ తరగతికి చెందిన భౌతిక, రసాయన, జీవశాస్త్ర ప్రశ్నలనిధి పుస్తకాలను రచించారు. 7వ, 10వ తరగతుల మాసపత్రికలకు సంపాదకత్వం వహించారు. 24 అనువాద గ్రంథాలు కూడా రచించారు. సామాజిక సేవ: రచయితగా, ఉపాధ్యాయునిగా సేవలు అందిస్తూనే సామాజిక కార్యకర్తగా కూడా పేరుపొందారు.వెనుకబడిన లంబాడి తండాలలో 1982-85 ప్రాంతంలో AIRDS సంస్థ తరఫున ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటుచేశారు. వయోజనులకు రాత్ర్రిబడులను నడిపారు. బాలలహక్కులకోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. పర్యావరణంపై అవగాహక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించారు. గుర్తింపులు:
= = = = =
|
12, జూన్ 2016, ఆదివారం
బూర్గుల శ్రీనాథశర్మ (Burgula Sreenatha Sharma)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి