కనగల్ నల్గొండ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 26 రెవెన్యూ గ్రామాలు, 22 గ్రామపంచాయతీలు కలవు. ఈ మండలము నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలం గుండా కనగల్ వాగు ప్రవహిస్తోంది. పిన్ కోడ్ 508255. రచయిత సుంకిరెడ్డి నారాయణరెడ్డి ఈ మండలమునకు చెందినవారు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలంలో నల్గొండ జిల్లాలో దాదాపు మధ్యలో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన నల్గొండ మండలం, దక్షిణాన హాలియా మరియు గుర్రంపోడు మండలాలు, పశ్చిమాన చండూర్ మండలం, వాయువ్యాన మునుగోడ్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 38303, 2011 నాటికి జనాభా 5464 పెరిగి 43767 కు చేరింది 2001 జనాభా ప్రకారము జిల్లాలో 53వ స్థానంలో ఉండగా 2011 నాటికి 45వ స్థానానికి చేరింది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 43767. ఇందులో పురుషులు 22430, మహిళలు 21337. రాజకీయాలు: ఈ మండలము నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2014లో కనగల్ ఎంపీపీగా కొప్పుల కృష్ణయ్య, జడ్పీటీసిగా నర్సింగ్ శ్రీనుగౌడ్ ఎన్నికయ్యారు. రవాణా సౌకర్యాలు: నల్గొండ నుంచి దేవరకొండ వెళ్ళు రహదారి కనగల్ మండలం మీదుగా వెళ్ళుచున్నది. ఈ మండలానికి రైలు సౌకర్యం లేదు. సరిహద్దులో ఉన్న నల్గొండ మీదుగా రైలుమార్గం వెళ్ళుచున్నది. మండలంలోని గ్రామాలు: ఇరుగంటిపల్లి • ఎం.గౌరారం • కనగల్ • గడ్డంవారి యడవల్లి • చర్ల గౌరారం • చిన్నమాదారం • చెట్లచెన్నారం • చెన్నారం • జంగమయ్యగూడ • తుర్కపల్లి • తోరగల్ • దర్వేష్‌పూర్ • దోరేపల్లి • నరసింహాపూర్ • పగిడిమర్రి • పర్వతగిరి • పొనుగోడు • బుడమెర్లపల్లి • బొమ్మేపల్లి • బోయినపల్లి • మంగెనపల్లి • మైలారం • రేగట్ల • శేరిలింగోటం • షా అబ్దుల్లాపూర్ • హైడ్లాపూర్ ఇవి కూడా చూడండి:
= = = = =
|
9, జూన్ 2016, గురువారం
కనగల్ మండలం (Kanagal Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి