భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 24 మండలాలు ఉన్నాయి. ఈ జిల్లా పరిపాలనకేంద్రం కొత్తగూడెం. ప్రముఖమైన శ్రీసీతారామాలయం నెలకొనియున్న భద్రాచలం ఈ జిల్లాలో ఉంది. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు ఖమ్మం జిల్లాకు చెందినవి. ఈ జిల్లా తెలంగాణలో అతి తూర్పు జిల్లాగా ఖ్యాతిచెందింది. కిన్నెరసాని ప్రాజెక్టు, ప్రాచీనకాలం నాటి రాక్షసగుళ్ళు లభించిన గుండాల మండలం ఈ జిల్లాలో ఉన్నాయి. గోదావరి నది, దాని ఉపనది అయిన కిన్నెరసాని నదులు జిల్లా గుండా ప్రవహిస్తున్నాయి.
జిల్లా సరిహద్దులు: ఈ జిల్లాకు పశ్చిమాన జయశంకర్ జిల్లా, మహబూబాబాదు జిల్లా మరియు ఖమ్మం జిల్లాలు ఉండగా, ఉత్తరాన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, తూర్పున మరియు దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. మండలాలు: కొత్తగూడెం, పాల్వంచ, టేకులపల్లి, యెల్లందు, చంద్రుగొండ, అశ్వారావుపేట, ముల్కలపల్లి, దమ్మపేట, గుండాల, జూలుర్‌పాడు, సుజాతానగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, ఆళ్ళపల్లి, అన్నపురెడ్డిపల్లి, భద్రాచలం, దుమ్ముగూడెం, చెర్ల, బూర్గంపహాడ్, అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం. పట్టణాలు: జిల్లాలో కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు పురపాలక సంఘాలుగా ఉన్నాయి.
ప్రాజెక్టులు: కిన్నెరసాని ప్రాజెక్టు, సీతారాంసాగర్ ప్రాజెక్టు, తాలిపేరు ప్రాజెక్టు, పెదవాగు ప్రాజెక్టు, సింగభూపాలెం, మూకమామిడి. రాజకీయాలు: ఈ జిల్లాపరిధిలోని శాసనసభ నియోజకవర్గాలు: కొత్తగూడెం, ఇల్లందు, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం. లోకసభ నియోజకవర్గాలు: ఖమ్మం, మహబూబాబాదు. పర్యాటక ప్రాంతాలు: భద్రాచలం శ్రీసీతారామలయం, పర్ణశాల, కిన్నెరసాని అభయారణ్యం, ఇవి కూడా చూడండి:
= = = = =
ఆధారాలు:
|
Tags: News Districts in telangana, Kothagudem Dist in Telugu, kothagudem dist telugulo, 27 dists in telangana in telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి