23, నవంబర్ 2016, బుధవారం

మంగళంపల్లి బాలమురళీకృష్ణ (Mangalampalli Balamuralikrishna)

జననంజూలై 6, 1930
జన్మస్థానంశంకరంగుప్త
రంగంకర్ణాటక సంగీతం
మరణంనవంబర్ 22, 2016
కర్ణాటక సంగీతంలో ప్రఖ్యాతిగాంచిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ జూలై 6, 1930న తూర్పు గోదావరి జిల్లా శంకరంగుప్త గ్రామంలో జన్మించారు. ఎనిమిదేళ్ళ చిన్నవయస్సులోనే కచేరి చేయడం ప్రారంభించారు. వయొలిన్ విద్వాంసుడిగా, వాగ్గేయకారుడిగా, సినీ సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, నటుడిగా గుర్తింపు పొందారు. సంగీత నాటక అకాడమీ పురస్కారం, పద్మశ్రీ, పద్మవిభూషణ, యునెస్కో నుంచి మహాత్మాగాంధీ సిల్వర్ మెడల్, డాక్టరేట్ లాంటి పలు బిరుదులను పొందారు. 86 ఏళ్ళ వయస్సులో నవంబర్ 22, 2016న మరణించారు.

సంగీత ప్రస్థానం:
చిన్న వయస్సులోనే సంగీత ప్రస్థానం ఆరంభించిన మురళీకృష్ణ జీవితకాలంలో ప్రపంచవ్యాప్తంగా 25000 కచేరీలు చేశారు. హిందుస్తానీ సంగీతంలోని ప్రముఖ సంగీతకారులతో కలిసి పనిచేశాడు మరియు జుగల్ బందీ తరహా కచేరీల రూపకల్పనకి ఆద్యుడు. వయోలిన్, వయోలా, వీణ, మృదంగం మెదలగు సంగీతవాయిద్యాలు వాయించడంలో కూడా ప్రావీణ్యం సంపాదించారు. జీవితకాలంలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకొన్నారు. తిరుపతి తిరుమల దేవస్థానము, శృంగేరీ పీఠాలకు ఆస్థాన విద్వాంసుడిగా కూడా పనిచేశారు.

పురస్కారాలు:
బాలమురళీకృష్ణ 1971లో భారతప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని, 1975లో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని, 1976 & 1987లలో ఉత్తమ సంగీతదర్శకుడిగా జాతీయ ఫిలిం అవార్డులను, 1991లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని, సంగీత కళాశిఖామణి అవార్డును పొందారు.


హోం,
విభాగాలు:
తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు, 1930లో జన్మించినవారు, 2016లో మరణించినవారు, సంగీత విధ్వాంసులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక