తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలలో ఒకటి. కాకినాడ పరిపాలన కేంద్రంగా ఉన్న ఈ జిల్లాలో కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, రామచంద్రాపురం, సామర్లకోట పట్టణాలు ప్రముఖమైనవి. 5వ నెంబరు జాతీయ రహదారి మరియు చెన్నై - కోల్‌కత రైలుమార్గం జిల్లా గుండా వెళ్ళుచున్నాయి. జిల్లాలో 60 రెవెన్యూ మండలాలు, 19 అసెంబ్లీ నియోజకవర్గాలు కలవు. ద్రాక్షారామం, అన్నవరం, అంతర్వేది, పిఠాపురం ఈ జిల్లాలోని ప్రముఖ క్షేత్రాలు. జిల్లా వైశాల్యం 10,807 చకిమీ, 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 51,51,549. ప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు, సమరయోధుడు బులుసు సాంబమూర్తి, లోకసభ స్పీకరుగా పనిచేసిన జి.ఎం.సి.బాలయోగి, రచయిత పానుగంటి లక్ష్మీనరసింహరావు, నటి సూర్యకాంతం ఈ జిల్లాకు చెందినవారు. జిల్లాకు ఆగ్నేయాన బంగాళాఖాతం, ఉత్తరాన ఒడిషా సరిహద్దులుగా ఉన్నాయి.
భౌగోళికం, సరిహద్దులు: తూర్పు గోదావరి జిల్లా 16° 30' - 18° 20' ఉత్తర అక్షాంశాలు, 81° 30' - 82° 36' తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. ఈ జిల్లాకు ఆగ్నేయాన బంగాళాఖాతం, ఉతరాన ఒడిషా రాష్ట్రం సరిహద్దులుగా ఉండగా, తూర్పున విశాఖపట్టణం, పశ్చిమాన పశ్చిమ గోదావరి జిల్లా, వాయువ్యాన తెలంగాణ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. పశ్చిమ సరిహద్దులో గోదావరి నది పశ్చిమ గోదావరి జిల్లాతో వేరుచేస్తున్నది. జిల్లా వైశాల్యం 10807 చదరపు కిలోమీటర్లు.
వివిధ కాలాలలో జిల్లా ప్రాంతాన్ని మౌర్యులు, శాతవాహనులు, గుప్తులు, విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, కాకతీయులు, ముసునూరి రెడ్లు, గోల్కొండ సుల్తానులు, బ్రిటీష్ వారు పాలించారు. స్వాతంత్ర్యానంతరం 1953 వరకు మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండి, 1953-56 కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా కొనసాగుతోంది.
2011 జనాభాగణాంకాలను అనుసరించి తూర్పు గోదావరి జిల్లా జనసంఖ్య 51,51,549. ఇది దేశంలో 19వ స్థానంలో, రాష్ట్రంలో ప్రథమస్థానంలో ఉంది. జనసాంద్రత 477. 2001-11 కాలంలో 5.1% జనాభా వృద్ధిచెందింది. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, మండపేట, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రాపురం, సామర్లకోట, తుని జిల్లాలోని పెద్దపట్టణాలు. రవాణా సౌకర్యాలు: 5వ నెంబరు జాతీయ రహదారు జిల్లా గుండా వెళ్ళుచున్నది. అన్నవరం, ప్రత్తిపాడు, జగ్గంపేట, రాజమండ్రి ఈ రహదారిపై ఉన్న ప్రధాన నగరాలు, చెన్నై నుంచి కోల్‌కత వెళ్ళు రైలుమార్గం గూడా జిల్లా నుంచి వెళ్ళుచున్నది. తుని, సామర్లకోట, ద్వారపూడి, రాజమండ్రి ఈ మార్గంలోని ప్రధాన రైల్వేస్టేషన్లు. సామర్లకోట నుంచి కాకినాడకు మరో మార్గం కూడా ఉంది. ఇవి కాకుండా ప్రధాన పట్టణాలను కలుపుతూ జిల్లా అంతటా రహదారులు కలవు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
5, ఫిబ్రవరి 2015, గురువారం
తూర్పు గోదావరి జిల్లా (East Godavari District)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి