25, నవంబర్ 2016, శుక్రవారం

సరోజినీ నాయుడు (Sarojini Naidu)

జననంఫిబ్రవరి 13, 1879
జన్మస్థానంహైదరాబాదు
పదవులుINC అధ్యక్షులు, ఉత్తరప్రదేశ్ గవర్నరు
మరణంమార్చి 2, 1949
భారతకోకిలగా ప్రసిద్ధి చెందిన సరోజినీ నాయుడు ఫిబ్రవరి 13, 1879న హైదరాబాదులో జన్మించింది. తండ్రి అఘోరనాథ చటోపాధ్యాయ ప్రముఖ విద్యావేత్త, తల్లి వరదాసుందరి దేవి. వీరిది బెంగాలీ బ్రాహ్మణ కుటుంబం. సరోజినీనాయుడు మంచి రచయిత్రి, సామాజిక కార్యకర్త మరియు స్వాతంత్ర్య సమరయోధురాలు. 1925లో కాన్పూర్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించడమే కాకుండా స్వాతంత్ర్యానంతరం ఉత్తరప్రదేశ్ గవర్నరు పదవి పొంది దేశంలోనే తొలి మహిళా గవర్నరుగా రికార్డు సృష్టించింది. గోల్డెన్ థ్రెశోల్డ్, ది బర్ద్ ఆఫ్ టైం, ది బ్రోకెన్ వింగ్ ఈమె ప్రముఖ రచనలు. 1908 మూసీనది వరదల సమయంలో ఈమె చేసిన సేవకుగాను నిజాం ప్రభుత్వం కైజర్-ఎ-హింద్ బిరుదాన్ని ప్రసాదించింది. మార్చి 2, 1949న సరోజినీనాయుడు మరణించింది.

సమరయోధురాలిగా మరియు రాజకీయాలు:
ప్రారంభంలో సరోజినీనాయుడు మహిళా సంక్షేమం కోసం కృషిచేసింది. అదే క్రమంలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో పాల్గొనడం ప్రారంభించింది. అనతికాలంలోనే ప్రముఖ నాయకురాలిగా చెలామణి అయింది. 1925లో కాన్పూర్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు సరోజినీ అధ్యక్షత వహించింది. 1931లో రౌండ్ టేబుల్ సమావేశాలకు భారతదేశ ప్రతినిధిగా హాజరయ్యారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళారు. స్వాతంత్ర్యానంతరం ఉత్తరప్రదేశ్ గవర్నరు పదవి చేపట్టి దేశంలోనే తొలి మహిళా గవర్నరుగా గణతికెక్కారు.
సరోజినీ నాయుడు జనరల్ నాలెడ్జి

బంధుత్వం:
సరోజినీనాయుడు తండ్రి అఘోరనాథ చటోపాధ్యాయ ప్రముఖ విద్యావేత్త మతియు నిజాం కళాశాల తొలి ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. కూతురు పద్మజానాయుడు పశ్చిమబెంగాల్ గవర్నరుగా పనిచేసింది. కుమారుడు జయసూర్యనాయుడు స్వాతంత్ర్య సమరయోధుడు మరియు రాజకీయనాయకుడు. సోదరుడు హరీంద్రనాథ్ చటోపాధ్యాయ కవిగా పేరుపొందారు.

ఇవి కూడా చూడండి

విభాగాలు: భారతదేశ ప్రముఖ మహిళలు, హైదరాబాదు, తెలంగాణ ప్రముఖులు, భారతదేశ ప్రముఖ మహిళలు, ఉత్తరప్రదేశ్ గవర్నర్లు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు, హైదరాబాదు జిల్లా సమరయోధులు, హైదరాబాదు జిల్లా రాజకీయ నాయకులు,


 = = = = =



Tags: Sarojini Naidu in Telugu, Sarojini Naidu essay in Telugu,

Tags:Sarojini Naidu in telugu, Sarojiji Naidu Essay, Telangana Famous Persons biography in Telugu, Hderabad Famous Persons in Telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక