జనగామ జనగామ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 21 గ్రామపంచాయతీలు, 20 రెవెన్యూ గ్రామాలు కలవు. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్విభజన సమయంలో జనగామ జిల్లాకేంద్రంగా మారింది. అంతకు క్రితం ఇది వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. సికింద్రాబాదు-కాజీపేట రైలుమార్గం, హైదరాబాదు-వరంగల్ జాతీయ రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నాయి.
తెలంగాణలో మొఘలాయిలను అడ్డుకున్న సర్వాయి పాపన్న ఈమండలమునకు చెందినవారు. తెలంగాణ శివాజీగా పేరుపొందిన సర్వాయిపాపన్న ఈ మండలమునకు చెందినవాడు. ఖిలాషాపురంలో పాపన్న నిర్మించిన కోట, ఇత్తడి కళలకు పేరుగాంచిన పెంబర్తి ఈ జిల్లాలోఉన్నాయి. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన నర్మెట్ట మండలం, తూర్పున రఘునాథపల్లి మండలం, దక్షిణాన లింగాల ఘన్‌పూర్ మండలం, పశ్చిమాన బచ్చన్నపేట మండలం, నైరుతిన యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: సికింద్రాబాదు-కాజీపేట రైల్వేలైన్ మరియు హైదరాబాదు- వరంగల్ ప్రధాన రహదారి మండలం గుండా వెళ్ళుచున్నవి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 92475. ఇందులో పురుషులు 46816, మహిళలు 45659.మండలంలో పట్టణ జనాభా 52408, గ్రామీణ జనాభా 40067. అక్షరాస్యత శాతం 73.70%. రాజకీయాలు: ఈ మండలము జనగామ అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన మేకల కళింగరాజు, జడ్పీటీసిగా తెరాసకు చెందిన నిమ్మతి దీపిక ఎన్నికయ్యారు.
జనగామ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Adavikeshvapur, Cheetakodur, Chowdaram, Chowdarpalli, Gangupahad Goparajpalli, Jangaon, Marigadi, Oblakeshvapur, Pasarmadla, Peddapahad, Peddaramancherla, Pembarthy, Shamirpet, Siddenki, Venkriyala, Wadlakonda, Yellamla, Yerragollapahad, Yeswanthapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఖిలాషాపూర్ (Khilashapur): ఖిలాషాపూర్ జనగామ జిల్లా జనగామ మండలమునకు చెందిన గ్రామము. తెలంగాణ చరిత్రలో ప్రముఖ పేరుపొందిన సర్వాయిపాపన్న ఈ గ్రామంలోనే ఆగస్టు 18, 1650 నాడు జన్మించారు. మొఘలాయిలతో వీరోచితంగా పోరాడి గోల్కొండ కోటను సైతం స్వాధీనం చేసుకున్న ఘనత ఈతనికి దక్కింది. పెంబర్తి (Pembarti): పెంబర్తి జనగామ జిల్లా జనగామ మండలమునకు చెందిన గ్రామము. ఇది ఇత్తడి కళారూపాలకు ప్రసిద్ధిచెందింది. ఈ గ్రామం హైదరాబాదు నుంచి వరంగల్ వెళ్ళు జాతీయ రహదారిపై ఉంది. షామీర్‌పేట్ (Shamirpet): షామీర్‌పేట్ జనగామ జిల్లా జనగామ మండలమునకు చెందిన గ్రామము. జనవరి 2017న ఈ గ్రామం జనగామ జిల్లాలో తొలి మరియు తెలంగాణలో మూడో నగదు రహిత గ్రామంలో అవతరించింది. 100% మరుగుదొడ్లు పూర్తిచేసిన జిల్లాలో తొలి గ్రామంగా కూడా గతంలో రికార్డు షృష్టించింది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Station Jangoan Mandal in Telugu, Jangoan Dist (district) Mandals in telugu, Janagoan Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి