పాలకుర్తి జనగామ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 17 ఎంపీటీసి స్థానాలు, 36 గ్రామపంచాయతీలు, 21 రెవెన్యూ గ్రామాలు కలవు. 12వ శతాబ్దికి చెందిన ప్రముఖ శివకవి పాల్కురికి సోమన, 15వ శతాబ్దికి చెందిన సహజకవి బమ్మెర పోతన, ప్రముఖ గణితవేత్త చుక్కా రామయ్య ఈ మండలమునకు చెందినవారు. విమోచనోద్యమ కాలంలో పేరుపొందిన విస్నూరు ఈ మండలంలోనిదే.
అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన జనగామ జిల్లాలోకి చేరింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన స్టేషన్ ఘన్‌పూర్, జఫర్‌ఘడ్ మండలాలు, దక్షిణాన కొడకండ్ల మండలం, పశ్చిమాన దేవరుప్పల మండలం, వాయువ్యాన రఘునాథపల్లి మండలం, తూర్పున వరంగల్ గ్రామీణ జిల్లా మరియు మహబూబాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. చరిత్ర: పాలకుర్తి చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ప్రాంతం. 12వ శతాబ్దికి చెందిన ప్రముఖ శివకవి పాల్కురికి సోమనాథుడు మండలకేంద్రమైన పాలకుర్తికి చెందినవాడు. అప్పట్లోనే ఈ పట్టణం ప్రముఖ శైవక్షేత్రంగా అభివృద్ధి చెందింది. కాకతీయుల కాలంలో ఈ ప్రాంతం వైభవంగా వెలుగొందినది. సహజకవిగా ప్రఖ్యాతిగాంచిన 15వ శతాబ్దికి చెందిన బమ్మెరపోతన కూడా పాలకుర్తి మండలంలోని బమ్మెర గ్రామానికి చెందినవాడు. బమ్మెర గ్రామంలోనే పోతన మహాభాగవతాన్ని రచించినట్లు శిలాశాసనం ఆధారంగా చరిత్రకారులు నిర్థారించారు. ఆధునిక కాలంలో ఆసఫ్‌జాహీ, నిజాంషాహీ రాజ్యంలో భాగంగా కొనసాగి 1948లో హైదరాబాదు విమోచన అనంతరం 1956వరకు హైదరాబాదు రాష్ట్రంలో, ఆ తర్వాత 2014 వరకు ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగి జూన్ 2, 2014 నుంచి తెలంగాణలో భాగంగా ఉంది. 2016లో ఈ మండలం వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన జనగామ జిల్లాలోకి మారింది. రవాణా సౌకర్యాలు: మండలం ఉండా రైలుమార్గంకాని, జాతీయ రహదారి కాని లేవు. అయిననూ జిల్లా కేంద్రం వరంగల్ నుంచి రహదారి సౌకర్యం ఉంది. పశ్చిమన ఉన్న జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ నుంచి జాతీయరహదారి వెళ్ళుచున్నది. జనాభా: 2001 ప్రకారం మండల జనాభా 54243. ఇందులో పురుషులు 27669, మహిళలు 26587. గృహాల సంఖ్య 11963. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 58190. ఇందులో పురుషులు 29288, మహిళలు 28902. గూడూర్, పాలకుర్తి, దర్దేపల్లి, బమ్మెర, వావిలాల మండలంలోని పెద్ద గ్రామాలు. రాజకీయాలు: ఈ మండలము పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2014లో పాలకుర్తి మండల అధ్యక్షులుగా దల్జీత్ కౌర్ భుక్యా, జడ్పీటీసి సభ్యుడిగా గణేష్ బన్నెపాక ఎన్నికయ్యారు. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన నల్ల నాగిరెడ్డి, జడ్పీటీసిగా తెరాసకు చెందిన పుస్కుం శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.
పాలకుర్తి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ayyangaripalli, Bommera, Chennur, Dardepalli, Gudur, Iravennu, Kondapuram, Kothalabad, Lakshminarayana Puram, Mailaram, Mallampalli, Manchuppula, Mutharam, Palakurthi, Shatapuram, Theegaram, Thirmalagiri, Thorrur, Valmidi, Vavilala, Visnoor
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
బమ్మెర (Bammera): బమ్మెర జనగామ జిల్లా పాలకుర్తి మండలమునకు చెందిన గ్రామము. ఇది మండల కేంద్రం పాలకుర్తికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. 15వ శతాబ్దికి చెందిన ప్రముఖ కవి, సహజకవిగా ప్రసిద్ధి చెందిన బమ్మెర పోతన ఈ గ్రామంలోనే జన్మించాడు. 1957లో అప్పటి లోకసభ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్ పోతన జన్మస్థలాన్ని దర్శించడానికి బమ్మెర గ్రామం సందర్శించారు. ఈ గ్రామంలో పురాతన రామాలయం ఉంది. ఆలయం వద్దనే శిలాశాసనం ఉంది. ఇక్కడే పోతనమహాభాగవతాన్ని రచించినట్లు ప్రతీతి. 1954లో బమ్మెర గ్రామంలో పోతన ఉత్సవాలు జరిగాయి. పోతనామాత్యుని గీత్రమైన కౌండిన్యస గోత్రికులు ఇప్పటికీ గ్రామంలో ఉన్నారు. గూడూరు (Gudur): గూడూరు జనగామ జిల్లా పాలకుర్తి మండలమునకు చెందిన గ్రామము. విమోచనోద్యమ మరియు గ్రంథాలయోద్యమ నాయకుడు చౌడవరపు విశ్వనాథం, ప్రముఖ గణితవేత్త చుక్కా రామయ్య ఈ గ్రామానికి చెందినవారు. పాలకుర్తి (Palakurthy): పాలకుర్తి వరంగల్ జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. ఇది ప్రముఖ శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. 12వ శతాబ్దికి చెందిన ప్రముఖ శివకవి పాల్కురికి సోమన స్వగ్రామం. సోమనాథునీ సమాధి కూడా గ్రామంలోనే ఉంది. పాలకుర్తి గ్రామానికి దక్షిణ వైపున వల్మిడి గ్రామం ఉంది. ఇక్కడ పూర్వం రామాయణాన్ని రచించిన వాలికీ ఆశ్రమం ఉండేదని ప్రతీతి. గుట్టమీద ఇప్పటికీ రామాలయం ఉంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Palakurthy Mandal in Telugu, Jangoan Dist (district) Mandals in telugu, Janagoan Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి