16, ఫిబ్రవరి 2017, గురువారం

జనగామ మండలం (Janagoan Mandal)

జనగామ మండలం
జిల్లాజనగామ జిల్లా
జనాభా 92475 (2011)
అసెంబ్లీ నియో.జనగామ
లోకసభ నియో.భువనగిరి
జనగామ జిల్లాకు చెందిన మండలము. సికింద్రాబాదు-కాజీపేట రైల్వేలైన్ మండలం గుండా వెళ్ళుచున్నది. తెలంగాణలో మొఘలాయిలను అడ్డుకున్న సర్వాయి పాపన్న ఈమండలమునకు చెందినవారు. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 18 గ్రామపంచాయతీలు, 20 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలంలోని వడ్లకొండ, చీటకోడూరు శివారులో మైసమ్మగుట్ట, పొట్టిగట్ట, కోటిగుట్టలలో ఆదిమానవుల అబశేషాలు వెలుగుచూశాయి. ఇత్తడి కళలకు పేరుగాంచిన పెంబర్తి ఈ జిల్లాలో ఉంది
అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్విభజన సమయంలో జనగామ జిల్లాకేంద్రంగా మారింది. అంతకు క్రితం ఇది వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. తెలంగాణ శివాజీగా పేరుపొందిన సర్వాయిపాపన్న ఈ మండలమునకు చెందినవాడు. ఖిలాషాపురంలో పాపన్న నిర్మించిన కోట ఉంది. సికింద్రాబాదు-కాజీపేట రైలుమార్గం, హైదరాబాదు-వరంగల్ జాతీయ రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నాయి.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 92475. ఇందులో పురుషులు 46816, మహిళలు 45659.మండలంలో పట్టణ జనాభా 52408, గ్రామీణ జనాభా 40067. అక్షరాస్యత శాతం
రవాణా సౌకర్యాలు:
సికింద్రాబాదు-కాజీపేట రైల్వేలైన్ మరియు హైదరాబాదు- వరంగల్ ప్రధాన రహదారి మండలం గుండా వెళ్ళుచున్నవి.
రాజకీయాలు:
ఈ మండలము జనగామ అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

మండలంలోని గ్రామాలు:
అడవి కేశ్వాపూర్, చీతకోడూర్, చౌడారం, చౌదర్‌పల్లి, గంగుపహాడ్, గోపరాజ్‌పల్లి, జనగామ, మరిగడి, ఓబ్లకేశ్వాపుర్, పాసర్‌మడ్ల, పెద్దపహాడ్, పెద్దరామన్‌చెర్, పెంబర్తి , షామీర్‌పేట్, సిద్దెంకి, వెంకిర్యాల్,
వడ్లకొండ, ఎల్లంల, ఎర్రగొల్లపహాడ్, యశ్వంత్‌పూర్

విభాగాలు: జనగామ జిల్లా మండలాలు, జనగామ మండలం,


 = = = = =Tags: Janagoan Mandal in Telugu, Janagoan Mandal information, Janagama Mandal in Telugu, Janagama samacharam.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక