నార్కెట్‌పల్లి నల్గొండ జిల్లాకు చెందిన మండలము. పూనా-విజయవాడ (9వ నెంబరు) జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. ఈ మండలం నల్గొండ రెవెన్యూ డివిజన్, నక్రేకల్ అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. చెర్వుగట్టులో శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరాలయం, గోపలాయపల్లిలో శ్రీవారిజాల వేణుగోపాలస్వామి ఆలయం ఉన్నాయి. నార్కెట్ పల్లి ప్రాంతంలో వేల సంఖ్యలో ప్రాచీనకాలపు సమాధురాళ్ళు బయటపడ్డాయి. రాజకీయ నాయకులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మండలానికి చెందినవారు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం నల్గొండ జిల్లా ఉత్తర భాగంలో యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దులో ఉంది. తూర్పున శాలిగౌరారం మరియు కట్టంగూరు మండలాలు, దక్షిణాన నల్గొండ మండలం, పశ్చిమాన చిట్యాల మండలం, నైరుతిన మునుగోడ్ మండలం, ఉత్తరాన మరియు వాయువ్యాన యాదాద్రి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 46150, 2011 నాటికి జనాభా 4812 పెరిగి 50962 కు చేరింది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 50962. ఇందులో పురుషులు 25988, మహిళలు 24974. రవాణా సౌకర్యాలు: 65వ నెంబరు జాతీయ రహదారి (పాతపేరు NH-9) మరియు సికింద్రాబాదు గుంటూరు రైల్వేమార్గం మండలం గుండా వెళ్ళుచున్నాయి. మండలంలోని గ్రామాలు: అక్కినేనిపల్లి (Akkinepalli), అక్కినేనిపల్లివారి లింగోటం (Akkinepallivari Lingotam), అమ్మనబోలు (Ammanabolu), ఔరవాని (Auravani), బ్రాహ్మణ వెల్లంల (Brahmana Vellemla), చెర్వుగట్టు (Chervugattu), చిప్పలపల్లి (Chippalapalli), చౌడంపల్లి (Choudampally), మాడ యడవల్లి (Mada Yadavelli), మంద్ర (Mandra), నక్కలపల్లి (Nakkalapally), నార్కెట్‌పల్లి (Narketpally), నెమ్మని (Nemmani), పోతినేనిపల్లి (Pothinenipally), సబ్బిగూడెం (Sabbidigudem), షాపల్లి (Shapally), తిరుమలగిరి (Thirumalagiri), తొండల్వాయి (Thondalvai), ఎల్లారెడ్డిగూడ (Yellareddyguda) downloaded from https://cckraopedia.blogspot.com
ప్రముఖ గ్రామాలు:
బ్రాహ్మణవెల్లంల (Brahmana Vellamla):బ్రాహ్మణవెల్లంల నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలమునకు చెందిన గ్రామము. ప్రముఖ రాజకీయ నాయకులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ గ్రామానికి చెందినవారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్సైట్లు:
|
Tags:Nalgonda District Mandsls information in Telugu, Narketpally Mandal in Telugu,
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి