మహేశ్వరం రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం. ఈ మండలం కందుకూరు రెవెన్యూ డివిజన్, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. మండలంలో 19 ఎంపీటీసి స్థానాలు, 23 గ్రామపంచాయతీలు, 33 రెవెన్యూ గ్రామాలు కలవు. మండల కేంద్రంలో అక్కన్న-మాదన్నలు నిర్మించిన కోట ఉంది. 2011లో దేశంలోనే స్మార్ట్ కార్డూలు కలిగిన తొలి రెవెన్యూ యూనిట్‌గా ఈ మండలం రికార్డు సృష్టించింది. హైదరాబాదు నుంచి శ్రీశైలం వెళ్ళు రహదారి మండలం గుండా వెళ్ళుతుంది. సరిహద్దులు: ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో దాదాపు మధ్యలో ఉంది. ఉత్తరాన శంషాబాదు మండలం, తూర్పున ఇబ్రహీంపట్నం, కందుకూరు మండలాలు, దక్షిణాన కేశంపేట మండలం, పశ్చిమాన కొత్తూరు, నందిగామ మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 58499. ఇందులో పురుషులు 30213, మహిళలు 28286. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 64673. ఇందులో పురుషులు 33417, మహిళలు 31256. అక్షరాస్యుల సంఖ్య 34835. రాజకీయాలు:
ఈ మండలం మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో మహేశ్వరం నుంచి జడ్పీటీసిగా ఎన్నికైన అనితారెడ్డి (తీగల కృష్ణారెడ్డి కోడలు) రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మెన్ అయ్యారు. |
విభాగాలు: రంగారెడ్డి జిల్లా మండలాలు, మహేశ్వరం మండలము, కందుకూరు రెవెన్యూ డివిజన్, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం, |
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
- Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
- Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
- Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
- బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 250 తేది: 11-10-2016
Tags: Maheshwaram Mandal information in Telugu, అకాన్‌పల్లి (Akanpally), అల్మాస్‌గూడ (Almasguda), అమీర్‌పేట్ (Ameerpet), బాగ్‌మంకాల్ (Baghmankhal), డబీల్‌గూడ (Dabilguda), దివార్‌గూడ (Dilwarguda), దుబ్బచెర్ల (Dubbacherla), గంగారం (Gangaram), ఘట్‌పల్లి (Ghatpalli), గొల్లోర్ (Gollor), ఇమాంగూడ (Imamguda), కల్వకోల్ (Kalwakole), కొల్లపడ్కాల్ (Kollapadkal), కొంగర్ ఘుర్ద్ ఏ (Kongar Khurd A), కొంగర్ ఖుర్ద్ బి (Kongar Khurd B), మహేశ్వరం (Maheswaram), మాలిక్‌దాన్ గూడ (Malikdanguda), మంకాల్ (Mankhal), మంసాన్‌పల్లి (Mansanpalli), మొహబత్‌నగర్ (Mohabatnagar), నాగారం (Nagaram), నాగిరెడ్డిపల్లి (Nagireddipally), నందిపల్లి (Nandipally), పెండ్యాల్ (Pendyal), పోరండ్ల (Porandla), రావిర్యాల (Raviryal), సర్దార్ నగర్ (Sardar Nagar), సిరిగిరిపూర్ (Sirigiripur), శ్రీనగర్ (Sreenagar), సుభాన్‌పూర్ (Subhanpur), తుమ్మలూర్ (Thummaloor), తూప్రాఖుర్ద్ (Toopra Khurd), వెంకన్నగూడ (Venkannaguda)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి