శంకర్‌పల్లి రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం. భౌగోళికంగా ఈ మండలం జిల్లా వాయువ్యాన ఉన్నది. హైదరాబాదు నుంచి వాడి వెళ్ళు రైలుమార్గం మండలం గుండా వెళ్ళుచున్నది. పూల ఉత్పత్తికి ఈ మండలం పేరుగాంచినది. మండలం గుండా మూసినది ప్రవహిస్తుంది. ఈ మండలం చేవెళ్ళ రెవెన్యూ డివిజన్, చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలోని కొండకల్ గ్రామంలో రైల్వే, మెట్రో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటుచేయనున్నారు.
సరిహద్దులు: శంకర్‌పల్లి మండలం రంగారెడ్డి జిల్లాలో వాయువ్యాన సంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి దక్షిణాన చేవెళ్ళ మరియు మొయినాబాదు మండలాలు, నైరుతిన గండిపేట మండలం, మిగితావైపులా సంగారెడ్డి జిల్లా సరిహద్దుగా ఉంది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 55483. ఇందులో పురుషులు 28477, మహిళలు 27006. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 65376. ఇందులో పురుషులు 33351, మహిళలు 32025. అక్షరాస్యుల సంఖ్య 36995. శంకర్‌పల్లి గురించి ఈ బ్లాగులో గూగుల్ శోధన
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags:Shankarpalli Mandal in telugu, rangareddy Dist Mandals information in telugu, Shankarpally Mandal information in Telugu, villages in Shankarpalli Mandal: అంతప్పగూడ (Anthappaguda), బుల్కాపూర్ (Bhulkapur), చందిప్ప (Chandippa), ధోబీపేట్ (Dhobipet), దొంతన్‌పల్లి (Donthanpalle), ఫతేపూర్ (Fathepur), గోపులారం (Gopularam), హుస్సేన్‌పూర్ (Hussainipur), జాన్‌వాడ (Janwada), కొండకల్ (Kondakal), కొత్తపల్లి (Kothapalle), మహారాజ్‌పేట్ (Maharajpet), మాసానిగూడ (Masaniguda), మోకిల (Mokila), పెర్వేద చంచలం (Parveda Chanchalam), పర్వేద ఖాల్సా (Parveda Khalsa), ప్రొద్దుటూర్ (Proddutur), రామాంతపూర్ (Ramanthapur), రావల్‌పల్లి కలాన్ (Ravalpalle Kalan), సంకేపల్లి ఖాల్సా (Sankepalle Khalsa), సంకేపల్లి పైగా (Sankepalle Paigah), శంకర్‌పల్లి (Shankarpalle), సింగపూర్ (Singapur), టంగుటూర్ (Tangutoor), ఎలవర్తి (Yelwarthy), ఎర్వగూడ (Yervaguda)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి